Site icon Prime9

Healthy Foods: ఒత్తిడి ఆందోళనకు ఈ ఆహారంతో చెక్ పెట్టండిలా..!

healthy-foods-for-reduce-stress-levels

healthy-foods-for-reduce-stress-levels

Healthy Foods: ఆందోళన, ఒత్తిడి (స్ట్రెస్) అనేవి ఈరోజుల్లో ప్రతీ మనిషికీ చాలా కామన్ అయిపోయాయి. అయితే ఇంలాంటి సమయాల్లో కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల స్ట్రెస్, ఆందోళనను అదుపులో ఉంచవచ్చని చెప్తున్నారు నిపుణులు. సరైన పోషకాహారం కూడా మన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడే కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలేంటో తెలుసుకుందాం.

హెర్బల్ టీ
ఒక కప్పు వేడి టీ తాగడం వల్ల తక్షణమే స్ట్రెస్ నుంచి రిలీఫ్ అందిస్తుందని అందరికీ తెలుసు. కానీ ఒత్తిడి ఆందోళన సమయంలో హెర్బల్ టీ తీసుకుంటే.. సత్ఫలితాలు ఉంటాయి అంటున్నారు. లావెండర్, చమోమిలే టీలు మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయని నివేదికలు చెప్తున్నాయి.

ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు
కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అధ్యయనాల ప్రకారం ఒమేగా-3 డిప్రెషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. సీఫుడ్ అయిన చేపలను అంటే ట్యూనా, సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి చేపలను తినడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

పాలు
నిద్రపోయే ముందు వేడి పాలు తాగాలని వైద్యులు సలహా ఇస్తారు. ఎందుకంటే రాత్రిపూట ఒత్తిడి తగ్గి మంచి నిద్ర వస్తుంది కాబట్టి. గోరువెచ్చని పాలు శరీరానికి ఉపశమనం అందిస్తాయి.

డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది. అందుకే దీన్ని తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ శరీరంలోని ఒత్తిడిని తగ్గించగలవు. కానీ దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల కూడా హాని కలుగుతుంది.

నట్స్
విటమిన్లు, జింక్, మెగ్నీషియం కలిగి ఉన్నందున నట్స్ మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. B విటమిన్లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని చెప్తారు. అయితే మెగ్నీషియం ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. బాదం, పిస్తా, వాల్‌నట్‌లు కూడా రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.

గుడ్లు
గుడ్లలో విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. గుడ్లలో కోలిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.

ఇదీ చదవండి: తొక్కే కదా తీసిపారేస్తే.. మీకే నష్టం..!

Exit mobile version
Skip to toolbar