Site icon Prime9

Cold Water Bath in Winter: చలికాలంలో చన్నీటి స్నానం వల్ల ఎన్ని ప్రయోజనాలో..!

health benefits of cold water bath in winter

health benefits of cold water bath in winter

Cold Water Bath in Winter: చలికాలంలో వేడినీటితో స్నానం చేయటం కంటే చన్నీటి స్నానం చేయడమే ఉత్తమం అని నిపుణులు అంటున్నారు. అయితే కొంతమంది మాత్రం చల్లటి నీటితో అస్సలు స్నానం చెయ్యలేము బాబోయ్ అంటు గజగజావణుకుతున్నారు. కానీ సీజన్‌తో సంబంధం లేకుండా, ఉదయాన్నే లేచి స్నానం చేయడం చాలా అవసరం. అది కూడా చల్లటి నీటితో స్నానం చేస్తే ఎన్నో విధాలుగా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. స్నానం చేయడం వలన శరీరం పరిశుభ్రం అవడమే కాక, అది కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆందోళనను తగ్గిస్తుంది.

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
శరీరంపై పడే చల్లని నీటి జల్లులు మిమ్మల్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచేలా చేస్తాయి. రక్తాన్ని వివిధ అవయవాలకు తరలించేలా చేస్తాయి.
అదే వేడినీటితో చేసినపుడు ఈ ప్రభావం రివర్స్ ఉంటుంది. కానీ, చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ధమనులు బలంగా తయారవుతాయి,
రక్తపోటు తగ్గుతుంది. అందువలన, మీరు ఫిట్‌గా ఉండాలంటే చల్లటినీటితో స్నానం చేయండి.

చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచిది
చలికాలంలో వేడి నీటి స్నానం చేస్తే చర్మం పొడిబారుతుంది. చర్మంపై మొటిమలు, దద్దుర్లు కూడా ఏర్పడతాయి. చుండ్రు సమస్యలతో కూడా ఇబ్బంది పడతారు. అదే చల్లటి షవర్ క్యూటికల్స్ చర్మంపై రంధ్రాలను బిగిస్తుంది. చర్మం, స్కాల్ప్‌లోని రంధ్రాలను కూడా మూసివేస్తుంది, ఇలా మురికి చేరకుండా అడ్డుకుంటుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది
చల్లని నీరు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మీరు చల్లటి నీటితో స్నానం చేస్తే, తెల్ల రక్త కణాల శాతం పెరుగుతుంది, జీవక్రియ రేటు మెరుగవుతుంది. ఎందుకంటే చల్లటి స్నానంతో శరీరం దానంతటదే వేడెక్కడానికి ప్రయత్నిస్తుంది, ఆ ప్రక్రియలో తెల్ల రక్త కణాలను విడుదల చేస్తుంది. ఇలా రోగనిరోధక వ్యవస్థను మెరుగుపడుతుంది.

కండరాల రికవరీ
కండరాలు పట్టుకుంటే చన్నీటి స్నానంతో వేగంగా కండరాలను పూర్వస్థితికి తేవచ్చు. కండరాల నొప్పిని అధిగమించడానికి చల్లని జల్లులు సహాయపడతాయి. ఇది కోల్డ్ కంప్రెషన్ లాంటిది.

డిప్రెషన్‌ మాయం
చల్లటి నీరు సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మీరు ఒత్తిడిలో ఉంటే చల్లటి షవర్ కింద కాసేపు ఉండండి. బయటికి వచ్చిన తర్వాత మీరు మరింత రిలాక్స్‌గా ఉంటారు.

ఇదీ చదవండి: శీతాకాలంలో జలుబుకు చెక్ పెట్టండిలా..!

Exit mobile version