Site icon Prime9

Vijay Deverakonda: రౌడీ హీరోతో డేటంగ్ కు సై అంటున్న బాలీవుడ్ భామలు

Tollywood: రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండకు బాలీవుడ్‌లోనూ బాగా క్రేజ్ పెరిగిపోయింది. తాజాగా స్టార్‌ కిడ్స్, యంగ్‌ హీరోయిన్లు విజయ్ కోసం పోటీ పడుతుండటం విశేషం. అమ్మాయిలే కాదు, స్టార్‌ హీరోయిన్లు కూడా విజ‌య్ అంటే ఇష్టప‌డుతున్నార‌ని తెలుస్తోంది. బాలీవుడ్‌ హీరోయిన్లు సారా అలీ ఖాన్‌, జాన్వీ కపూర్‌ ‘కాఫీ విత్ క‌ర‌ణ్’ షోలో విజయ్‌ దేవరకొండ అంటే త‌మ‌కు క్రష్ అని బాహాటంగానే చెప్పేశారు. అంతేకాదు ఈ భామ‌లకు రౌడీ హీరోతో డేటింగ్‌కి కూడా వెళ్లాల‌నుంద‌ట‌.

కరణ్ జోహార్ యొక్క కాఫీ విత్ కరణ్ తాజా సీజన్లో ఒక ప్రశ్నలో, కరణ్ జోహార్ సారా డేటింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తి గురించి అడిగాడు. అతను, ‘సారా, ఈ రోజు మీరు డేటింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తి పేరు చెప్పండని అడిగాడు. దానిక సారా సంకోచించినప్పటికీ, ‘విజయ్ దేవరకొండ’ అని చెప్పింది. ఇది విన్న జాన్వీ కపూర్‌ షాక్‌కి గురయ్యింది. అది గమనించిన సారా ‘ఓహ్‌.. `నువ్వు కూడా అతన్ని ఇష్టపడుతున్నావా` అని ప్రశ్నించడం హైలైట్‌గా నిలిచింది.జాన్వీ కపూర్‌.. విజయ్ దేవరకొండపై తన క్రష్‌ని చాలా రోజుల క్రితమే వెల్లడించింది. అతనితో కలిసి జాన్వికి `లైగర్‌`లో కలిసి నటించే అవకాశం కూడా వచ్చింది. కానీ డేట్స్ కారణంగా వదులుకుంది.

కాగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా సారా కామెంట్స్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ స్పందించాడు. ‘విజ‌య్ దేవ‌ర‌కొండ’ అంటూ సారా నా పేరు ప‌లికిన తీరు నాకు బాగా న‌చ్చింది. నా ప్రేమ‌, కౌగిలింత‌లు మీ కోస‌మే’ అంటూ విజ‌య్‌ త‌న ఇన్‌స్టా స్టేట‌స్‌లో షేర్ చేయ‌డంతో అది కాస్తా వైర‌ల‌య్యింది.

Exit mobile version