Varun Tej – Lavanya Tripathi Marriage : మెగా ఫ్యామిలిలో పెళ్లిసందడి మొదలైంది. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి మరికొన్ని గంటల్లో ఒక్కటి కాబోతున్నారు. ఇటలీలోని టుస్కానీలో జరుగుతున్న వీరి డెస్టినేషన్ వెడ్డింగ్‌కు మెగా కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా పెళ్లి వేడుకల్లో భాగంగా హల్దీ వేడుక జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ హల్దీ వేడుక ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ జంట నేడు (నవంబర్ 1వ) తేదీన పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది. ఇటలీలో పెళ్లి అనంతరం హైదరాబాద్‌లో నవంబర్ ఐదో తేదీన గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.
అక్టోబర్ 30న ఫ్యామిలీ అంతా కాక్ టెయిల్ పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పార్టీలో రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహాలు కూడా కలర్‌ఫుల్‌గా కనిపించారు. ఇక 31న హల్దీ వేడుక కూడా ఘనంగా జరిగింది. కాగా.. ఈ ఏడాది జూన్ 9న నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.