Upcoming Releases : దసరా సందర్భంగా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలు మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ వారం కూడా పలు సినిమాలు సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. అయితే అక్టోబరు చివరి వారంలో పెద్ద సినిమాలు లేకపోయినప్పటికీ.. చిన్న చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం ఆడియన్స్ కి వినోదాన్ని పంచేందుకు థియేటర్, ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన ఆ సినిమాలు, సిరీస్‌లు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలు (Upcoming Releases)..
మార్టిన్ లూథర్ కింగ్..
సంపూర్ణేష్ బాబు హీరోగా వస్తున్న చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. తమిళంలో ఘన విజయం సాధించిన ‘మండేలా’ చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. పొలిటికల్ సెటైరికల్ మూవీగా రూపొందిన ఈ సినిమా అక్టోబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. వి.కె.నరేశ్, వెంకటేశ్ మహా, శరణ్య ప్రదీప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఘోస్ట్..
కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. శ్రీని దర్శకత్వంలో లేటెస్ట్ గా ఆయన నటించిన చిత్రం ‘ఘోస్ట్’. సందేశ్ నాగరాజ్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో సందడి చేయనుంది. అయితే ఇప్పటికే దసరా కానుకగా కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్టోబరు 27న తెలుగులోనూ రానుంది. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఘోస్ట్ తో శివన్న తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తారో చూడాలి..
తేజస్..
కంగనా రనౌత్ టైటిల్ పాత్ర పోషిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తేజస్’. సర్వేశ్ మేవారా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించారు. దేశభక్తి, తెగువ ఉన్న యుద్ధ విమాన పైలట్ తేజస్ గిల్.. పాకిస్థాన్‌లో చేపట్టిన ఒక రహస్య ఆపరేషన్ ఆధారంగా మూవీ తెరకెక్కింది. ఈ సినిమా అక్టోబరు 27న థియేటర్లలోకి రానుంది.
ఓటు..
హృతిక్ శౌర్య, తన్వి నేగి జంటగా రవి తెరకెక్కించిన చిత్రం ‘ఓటు’. చాలా విలువైనది.. అన్నది ఉపశీర్షిక. ఫ్లిక్ నైన్ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. గోపరాజు రమణ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా కూడా అక్టోబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు/వెబ్ సిరీస్‌ల వివరాలు (Upcoming Releases)..
నెట్‌ఫ్లిక్స్..
లైఫ్ ఆన్ ఔర్ ప్లానెట్ (సిరీస్) అక్టోబరు 25
చంద్రముఖి 2 (తమిళ్/తెలుగు) అక్టోబరు 26
పెయిన్ హజ్లర్స్ (హాలీవుడ్) అక్టోబరు 27
అమెజాన్ ప్రైమ్..
ఆస్పిరెంట్స్ (హిందీ సిరీస్2) అక్టోబరు 25
ట్రాన్స్‌ఫార్మార్స్ (హాలీవుడ్) అక్టోబరు 26
కాన్‌సిక్రేషన్ (హాలీవుడ్) అక్టోబరు 27
కాస్టావే దివా (కొరియన్) అక్టోబరు 28
డిస్నీ+హాట్‌స్టార్..
మాస్టర్ పీస్ (మలయాళం/తెలుగు) అక్టోబరు 24
కాఫీ విత్ కరణ్ (టీవీ షో) అక్టోబరు 26
స్కంద (తెలుగు) అక్టోబరు 27
ఆహా..
పరంపోరుళ్ (తమిళం) అక్టోబరు 24
బుక్ మై షో..
నైట్స్ ఆఫ్ ది జోడియాక్ (హాలీవుడ్) అక్టోబరు 24
జీ5..
దురంగా (వెబ్ సిరీస్) అక్టోబరు 24