Site icon Prime9

Vijay Devarakonda: పాప్యులారిటీ ఉన్నప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మాములే.. ఈడీ విచారణపై విజయ్ స్పందన

vijay-devarakonda-with-media-after-ed-questions

vijay-devarakonda-with-media-after-ed-questions

Vijay Devarakonda: లైగర్ సినిమా నిర్మాణ విషయంలో మనీలాండరింగ్, హవాలా డబ్బు భారీగా ఉందని ఈడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ పెట్టుబడులకు సంబంధించి హీరో విజయ్ దేవరకొండను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం సుమారు 12 గంటల పాటు విచారించింది. నిన్న ఉదయం 8:30 గంటలకు ఈడీ ఆఫీసుకు వచ్చిన విజయ్ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు. ఉదయం నుంచి ఏకధాటిగా విజయ్ ను అధికారులు విచారించారు. అయితే విచారణ ముగిసిన తర్వాత ఈడీ ఆఫీసు ముందు హీరో విజయ్ మీడియాతో మాట్లాడారు. విచారణపై స్పందిస్తూ పాప్యులారిటీ పెరుగుతున్నప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం మామూలే అని  రౌడీ బాయ్ వ్యాఖ్యానించారు.

విచారణకు రావాలంటూ అధికారులు నోటీసులు ఇవ్వడంతో బుధవారం ఈడీ ఆఫీసుకు వచ్చినట్లు విజయ్ తెలిపారు. బాధ్యతగల పౌరుడిగా అధికారులు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ జవాబిచ్చినట్లు చెప్పారు. తనను మళ్లీ రమ్మని పిలవలేదని స్పష్టం చేశారు. కాగా, లైగర్ డైరెక్టర్ పూరీజగన్నాథ్, నిర్మాత ఛార్మీలను ఈడీ అధికారులు ఇప్పటికే విచారించారు.

ఇదీ చదవండి: భయపడే ప్రసక్తే లేదు.. జైల్లో పెడతారా పెట్టుకోండి- ఎమ్మెల్సీ కవిత

Exit mobile version