Site icon Prime9

Mahesh Babu: సౌత్ ఇండియాలోనే మహేష్ టాప్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

mahesh-babu

mahesh-babu

Tollywood: మహేష్ ఆ పేరులోనే ఓ మత్తు ఉంటుంది అని ఓ సినిమాలో కలర్స్ స్వాతి చెప్పిన డైలాగ్. మహేష్ కున్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే అది నిజమేననిపిస్తుంది కొన్ని సార్లు. ఈ మిల్కీ బాయ్ ఎప్పుడు నెట్టింట తెగ యాక్టివ్ గా ఉంటాడు. సినిమాలతోనే కాకుండా వ్యాపారవేత్తగా బ్రాండ్ ఎంబాసిడర్ గా నిత్యం బిజీబిజీగా గడిపే ఈ స్టార్ హీలో నెట్టింట అభిమానులతో మాత్రం తన అప్ డేట్స్ మిస్ అవ్వకుండా ఇస్తుంటారు. ఈ నేపథ్యంలోనే సౌత్ ఇండియాలో ఏ స్టార్ హీరోకు దక్కని ఓ అరుదైన గౌరవం మహేష్ కు దక్కింది. సోషల్ మీడియా దిగ్గజం అయిన ట్విట్టర్ లో ఆయన ఫాలోవర్స్ సంఖ్య దాదాపు 13 మిలియన్లు దాటింది.

టాలీవుడ్ సూపర్ స్టార్‌ మహేష్‌ సోషల్‌ మీడియాలో మరో అద్భుతమైన మైలురాయిని చేరుకున్నారు. ట్విట్టర్‌లో మిల్క్ బాయ్ ఫాలోవర్స్‌ సంఖ్య 13 మిలియన్లకు చేరింది. దక్షిణాది తారల్లో మరెవరికీ ట్విట్టర్లో ఇంతమంది ఫాలోవర్స్‌ లేరట. ఈ ఘనత సాధించిన తొలి సౌత్‌ హీరోగా మహేష్‌ ఖ్యాతి సంపాదించారు. మహేష్‌ బాబు తర్వాత స్థానాల్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న స్టార్ హీరోలుగా ధనుష్‌, సూర్య, కమల్‌హాసన్‌ తదితరులు ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే ఈ స్టార్‌ హీరో తన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. అలాగే కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్లిన పిక్స్‌ కూడా షేర్‌ చేస్తుంటారు. ఇవన్నీ నెటిజన్లను ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ఆయన తన 28వ సినిమాలో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి: ఐటెం సాంగ్ కోసం మిస్ ఇండియాను తీసుకున్న బోయపాటి శ్రీను

Exit mobile version