Site icon Prime9

Sukumar: ముగ్గురు మొనగాళ్లు కలిసిన వేళ..

combo

combo

Tollywood: ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రముఖ సినీ ప్రముఖులు ఒక సినిమా కోసం కలిస్తే అది ప్రత్యేకమైన వార్త అని చెప్పవచ్చు. తాజాగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో త్రిమూర్తులు లాంటి వ్యక్తులు కలిసారు. దీనితో ఈ వీరి కలయిక పై పెద్ద చర్చ జరుగుతోంది.

స్టార్ డైరెక్టర్లు సుకుమార్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి మరియు నిర్మాత అభిషేక్ అగర్వాల్ జతకట్టనున్నారు. విభిన్న జానర్ సినిమాలను రూపొందించడంలో పేరు గాంచిన అభిషేక్ అగర్వాల్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబడుతుంది.

సుకుమార్, అభిషేక్, వివేక్ కలిసి ఉన్న ఫోటోను వారు సోషల్ మీడియాలో విడుదల చేశారు. సుకుమార్, వివేక్‌లలో ఎవరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారనేది తర్వాత వెల్లడి కానుంది. ఇలాంటి క్రేజీ కాంబినేషన్ ఇటీవల కాలంలో రాలేదు. అందువలన ఇది ఖచ్చితంగా సంచలనమేనని చెప్పవచ్చు.

Exit mobile version