Sankranthi Movies: ఈ సంక్రాంతికి(Sankranthi Movies) మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వారి సినిమాలతో పోటీలో నిలిచారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన “వాల్తేరు వీరయ్య” సినిమాని బాబీ దర్శకత్వం వహించాడు. బాలకృష్ణ హీరోగా వచ్చిన “వీర సింహారెడ్డి” చిత్రాన్ని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేశాడు.
ఫుల్ మాస్ అవతార్ లో వచ్చిన ఈ రెండు సినిమాలు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.
కేవలం మాస్ ఆడియన్స్ ని మాత్రమే కాకుండా సెంటిమెంట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకున్నాయి ఈ చిత్రాలు.
అయితే బాలయ్య సినిమాతో పోలిస్తే చిరంజీవి వాల్తేరు వీరయ్యకి ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తున్నారని చెబుతున్నారు.
జనవరి 12 వ తేదీన వీర సింహారెడ్డి రిలీజ్ కాగా.. 13 వ తేదీన వాల్తేరు వీరయ్య విడుదల అయ్యింది.
బాలయ్య సినిమాకి మొదటి రోజు కలెక్షన్స్ దుమ్ము లేపగా.. రెండో రోజు చిరు దెబ్బకి కలెక్షన్స్ కి భారీగా గండి పడింది.
అయితే ప్రస్తుతం రెండు సినిమాలు మంచి టాక్ తో దూసుకుపోతున్న తరుణంలో ఈ సినిమాల్లో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.
నిర్మాణ సంస్థ.. వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి.. రెండు సినిమాలని కూడా ఒక నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. వాళ్ళే ఈ సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేశారు కూడా.
హీరోయిన్.. ఈ రెండిట్లో కూడా శృతి హాసన్ హీరోయిన్ అవ్వడం మరింత గమనార్హం. రెండు సినిమాల్లోనూ మెయిన్ హీరోయిన్ కి అంతగా స్క్రీన్ స్పేస్ లేదు.
రవితేజ.. ఈ రెండు సినిమాల డైరెక్టర్స్ కి దర్శకులుగా మొదట లైఫ్ ఇచ్చింది రవితేజనే. రవితేజ సినిమాలతోనే వీరిద్దరూ డైరెక్టర్లుగా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు.
సినిమా నిడివి.. ఈ రెండు సినిమాలు కూడా రెండున్నర గంటలకు పైనే రన్నింగ్ టైం ఉంది.
హీరో ఓపెనింగ్ షాట్స్.. రెండు సినిమాల్లో హీరోల ఓపెనింగ్ షాట్స్ ఫైట్ సీన్స్ తోనే మొదలుపెట్టడం విశేషం.
కథ .. వీరసింహారెడ్డి సినిమా హీరోకి, సవతి తల్లి కూతురుకి సంబంధించిన కథ అయితే వాల్తేరు వీరయ్య హీరోకి, సవతి తల్లి కొడుకుకి సంబంధించిన కథ అవ్వడం మరింత విశేషం.
వాల్తేరు వీరయ్య అన్నయ్య-తమ్ముడు సెంటిమెంట్ అయితే వీరసింహారెడ్డి అన్నయ్య-చెల్లెలు సెంటిమెంట్ సినిమా.
ఇంటర్వెల్.. రెండు సినిమాల్లోనూ ఇంటర్వెల్ బ్యాంగ్ ఫారెన్ లోనే ఉంది. రెండు సినిమాల్లోనూ ఇంటర్వెల్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉన్నాయి.
క్లైమాక్స్.. రెండు సినిమాల్లోనూ క్లైమాక్స్ లో విలన్ పాత్ర తల నరికేయడం మరింత ఆశ్చర్యం.
సాంగ్స్.. ఈ రెండు సినిమాల్లోనూ మొత్తం పాటలలో రెండు, మూడు మాత్రమే ప్రేక్షకులను అలరించడం
ఈ సంక్రాంతికి రెండు సినిమాల్లోనూ అనేక కామన్ పాయింట్స్ ఉండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అయినా ఈ సినిమాలు ప్రేక్షకులకి నచ్చి మంచి విజయం సాధించాయి.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/