Site icon Prime9

Salman Khan: “మైడియర్ చిరు ఐ లవ్ యూ”.. నెట్టింట వీడియో వైరల్

Salman khan tweet to chiranjeevi

Salman khan tweet to chiranjeevi

Salman Khan: మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సంపాధించుకుంది. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ కలెక్షన్ల పర్వం కొనసాగిస్తుంది. కాగా ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. ఇకపోతే ఈ సినిమా హిట్ అయిన నేపథ్యంలో చిరంజీవిని ఉద్దేశించి సల్మాన్ ఖాన్ ఒక వీడియో సందేశాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

మసూద్ భాయ్ పాత్రలో సల్మాన్ ఈ సినిమాలో తనదైనశైలిలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఈ సినిమాలో చిరు సల్మాన్ మధ్య వచ్చే సీన్లు, పాట అభిమానుల చేత ఈలలు వేయించాయనుకోండి. ఇకపోతే ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతూ ఉండడాన్ని హర్షిస్తూ సల్మాన్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ అవుతుంది. ఈ మూవీ హిట్ అయిన సందర్భంగా చిరంజీవిని ఉద్దేశించి ‘మైడియర్ చిరు గారు ఐలవ్యూ. ‘గాడ్ ఫాదర్’ సినిమా బాగా ఆడుతోందని విన్నా. మీకు శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఉంటాయి. వందేమాతరం’ అంటూ సల్మాన్ ఖాన్ ఒక వీడియో సందేశాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

ఇదీ చదవండి: రాణా తమ్ముడు హీరోగా కుమ్మేశాడు.. అహింస టీజర్ రిలీజ్

Exit mobile version