Site icon Prime9

Samantha: సమంతకు మళ్లీ పెళ్లి.. ఎవరా లక్కీ పర్సన్..!

Samanth new post in social media goes viral

Samanth new post in social media goes viral

Tollywood: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఇక తెలుగు ప్రజలు అయితే ఆమెను చూసి “ఏమాయచేశావే” అంటారు. “మనం” అంటూ ఆమెపై ఆత్మీయత చూపుతారు. తన అందచందాలతో నటనతో అభిమానులను టాలీవుడ్ “మజిలి”కి చేర్చిన అందాల భామ. కింగ్ నాగార్జున తనయుడు హీరో నాగాచైతన్యను ప్రేమ వివాహం చేసుకుని ఇటీవలె కాలంలో వారిరువురు విడిపోయిన విషయం విధితమే. కాగా ఆ వార్త ప్రేక్షకాభిమానులను తీవ్రనిరాశకు గురించేసిందనే చెప్పుకోవచ్చు. అయితే తాజాగా సమంత మళ్లీ పెళ్లి చేసుకోబోతుందని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణాలేంటో ఓసారి చూసేద్దాం.

ఇదిలా ఉండగా విడాకుల అనంతరం సమంత, నాగచైతన్య ఇద్దరూ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా సమంత శాకుంతలం అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. మరోపక్క సమంత రెండో పెళ్లి అంటూ వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కాగా సమంత నాగచైతన్య విడాకులకు ఫ్యామిలీ మ్యాన్ మూవీనే కారణం అంటూ అనేక రూమర్స్ వినిపించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్న సమయంలో సామ్ బాలీవుడ్ నటుడితో లవ్ లో పడినట్లుగా టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సినీ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే సమంత నోరు విప్పాల్సిందే.

మరోవైపు సమంత నాగచైతన్య విడాకులను అటు అభిమానులే కాకుండా సమంత కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. రీసెంట్ గా సామ్ తండ్రి నాగచతన్య ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, అతడు మా కుటుంబంతో గడిపిన క్షణాలను మేం మర్చిపోలేం అంటూ కామెంట్ చేశారు. త్వరలోనే అన్నీ సర్దుకోవాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు.

Exit mobile version