Site icon Prime9

Ram Gopal Varma: నరహంతకుడు చంద్రబాబు.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

rgv comments on chandrababu

rgv comments on chandrababu

Ram Gopal Varma: టీడీపీ అధినేత చంద్రబాబుపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సారి తన స్టైల్ లో రెచ్చిపోయారు. చంద్రబాబుకి ప్రజల ప్రాణాలు గడ్డి పోచతో సమానం అని ఆయన అన్నారు. తన దగ్గర ఉన్న సమాచారం తో ఈ వీడియో చేస్తున్నా అని చెప్తూ పెద్ద గ్రౌండ్స్ లో సభలు పెడితే జనాలు రాలేదు అనుకుంటారు అని ఇరుకు సందుల్లో పెడితే ఎక్కువ మంది వచ్చారు అని ప్రచారం చేసుకోవచ్చు అని దానికి కూడా వస్తారా రారా అనే అనుమానంతో చంద్రన్న కానుకలు అనే పేరుతో కుక్కలకి బిస్కెట్లు వేసినట్టు జనాన్ని పిలిచారు అని ఆర్జీవీ అన్నారు.

3, 4 దఫాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకి జనాలకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తే వారు సురక్షితంగా తిరిగి ఇళ్ళకి వెళతారో ఆయనకు తెలియదా అని అడిగారు. ఆయనకీ ప్రజల ప్రాణాలు గడ్డి పోచతో సమానం అన్నారు. వస్తే కోటర్ ఇస్తా ఇవి ఇస్తా అనే సంస్కృతి తీసుకొచ్చింది చంద్రబాబే అన్నారు. ఎంత మంది చనిపోతే అంత పాపులారిటీ ఉంది అని ప్రచారం చేసుకోడానికి చంద్రబాబు ఇలా చేశారన్నారు.

40 సంవత్సరాల చరిత్ర ఉన్న చంద్రబాబుకి అలాంటి చోట సభ పెడితే ఏమి జరుగుతుందో తెలియదు అని చెప్తే టీడీపీ అభిమానులు నమ్ముతారేమో కానీ జనం నమ్మరు అని ఆయన అన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన కారణంగా చంద్రబాబుకి గౌరవం ఇచ్చాను కానీ ఈ ఘటన తర్వాత ఆ గౌరవం తగ్గింది అన్నారు ఆర్జీవీ. లీడర్ అవ్వాలి అంటే ముందు జనాల భద్రత ముఖ్య ఉద్దేశం అయ్యి ఉండాలి, ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళని చంపి వాళ్ళ మీద నుంచుని పాపులారిటీ పెంచుకోడం హిట్లర్ ముస్సోలిని తర్వాత చంద్రబాబు నే చూస్తున్నా అని ఆర్జీవీ అన్నారు.

Exit mobile version