Site icon Prime9

Ram Charan: నెట్టింట ట్రెండ్ అవుతున్న రాంచరణ్ న్యూలుక్

rc15-ram-charan-new-look-goes-viral

rc15-ram-charan-new-look-goes-viral

Ram Charan: టాలీవుడ్‌ స్టార్ హీరో రాంచ‌ర‌ణ్ ఎప్పటికపుడు సరికొత్త లుక్‌లో కనిపిస్తూ అభిమానుల్లో జోష్‌ నింపుతున్నారు. తాజాగా ఈ మెగా పవర్ స్టార్ ఓ న్యూ లుక్‌ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. కంప్లీట్‌ బ్లాక్ డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే ఒక జాకెట్ వేసుకుని దానికి తగిన గాగుల్స్‌తో కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చాడు. ఈ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్‌ అవుతున్నాయి.

ఇకపోతే ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం శంక‌ర్ డైరెక్షన్‌లో చేస్తున్న ఆర్‌సీ 15 సినిమాతో బిజీగా ఉన్నాడు. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ న్యూజిలాండ్‌ షెడ్యూల్‌లో బిజీగా ఉంది. ఓ వైపు షూటింగ్‌ షెడ్యూల్‌తో తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ కోసం ఇలా న్యూజిలాండ్ వీధుల్లో స్టైలిష్‌ లుక్ లో కనిపించి సందడి చేశాడు రాంచ‌ర‌ణ్.

ఇదీ చదవండి:  ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ టుడే

Exit mobile version