Site icon Prime9

Rashmika Mandanna: మహేశ్ సినిమాలో రష్మిక ఐటెం సాంగ్

rashmika-mandanna-to-appear-in-item-song-in-mahesh-babu-film

rashmika-mandanna-to-appear-in-item-song-in-mahesh-babu-film

Rashmika Mandanna: ఇటీవలి కాలంతో సినిమాలలో ఐటెం సాంగ్స్ హవా నడుస్తోంది. ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అంటే ప్రత్యేకంగా డ్యాన్సర్లు చేసేవారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్ అంటూ ఐటెం సాంగ్ వైపుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ స్టార్ హీరోయిన్లు ఒక్కో పాటకు కోటికి పైగా వసూలు చేస్తున్నారు. కాగా వీరితో ఐటెం సాంగ్ పెడితే తమ సినిమాకు భారీగా క్రేజ్ పెరుగుతుందని నిర్మాతలు కూడా భావిస్తున్నారు. దానితో దర్శక నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా హీరోయిన్లకు భారీగా ముట్టచెప్పేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే కాజల్, శ్రియ, సమంత, పూజాహెగ్డే ఇలా పలువురు అగ్ర కథానాయికలు ఎందరో ఐటెం సాంగుల్లో తళుక్కున మెరిశారు. ఇప్పుడు ఆ జాబితాలో రష్మిక మందన్న కూడా చేరనుంది.

మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో #SSMB28 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం రష్మికను తీసుకుంటున్నట్టు ఇండస్ట్రీ సమాచారం. త్రివిక్రమ్ ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో ఇంత వరకు ఒక ఐటెం సాంగ్ కూడా లేదు. అయితే తొలిసారిగా రష్మికతో తన సినిమాలో ఐటెం సాంగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది.

ఇదీ చదవండి: వచ్చే ఏడాది ఆగస్ట్ 11న #SSMB28

Exit mobile version
Skip to toolbar