Site icon Prime9

Ram Gopal Varma: ప్రభాస్ చిత్రంలో రామ్ గోపాల్ వర్మ

Varma

Varma

Tollywood: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించనున్నారు. ప్రబాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె నిర్మాతలు రామ్ గోపాల్ వర్మను ఒక చిన్న పాత్ర కోసం సంప్రదించారు. దానికి ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రాజెక్ట్ K లో ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించనున్న వర్మ త్వరలో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకోనున్నారు. జాతీయ-అవార్డ్-విజేత దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ప్రాజెక్ట్ K భారతీయ సినిమా యొక్క అతిపెద్ద చిత్రాలలో ఒకటి.

హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వివిధ సెట్స్‌ను వేస్తున్నారు. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం జనవరి 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది ప్రధమార్దంలో షూటింగ్ పార్ట్‌లను పూర్తి చేయాలని భావిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ప్రభాస్ ప్రశాంత్ నీల్ యొక్క సాలార్ మరియు మారుతి యొక్క ఇంకా పేరు పెట్టని చిత్రాల షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

Exit mobile version