Site icon Prime9

Pawan Kalyan: భవదీయుడు కాదు “ఉస్తాద్ భగత్ సింగ్”.. పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ సినిమా టైటిల్ మార్పు..!

pawan kalyan next movie with harish shankar is ustaad bhagat singh

pawan kalyan next movie with harish shankar is ustaad bhagat singh

 Pawan Kalyan: పవన్ హరీష్ శంకర్‌తో కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులకు పండగే. గతంలో వీరిద్దరి కాంబో వచ్చిన గబ్బర్ సింగ్ అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మరోమారు ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే మొదట్లో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే పేరుతో ఆ మూవీకి నామకరణం చేసి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కాగా ఇప్పుడు ఆ సినిమా పేరును మార్చుతూ మరో అప్డేట్ ను విడుదల చేశారు చిత్ర బృందం.

అయితే ‘భవదీయుడు భగత్ సింగ్’ నుంచి ప్రకటన వచ్చిందని పవన్ అభిమానులంతా ఎంతగానో సంతోషించారు. కానీ ఈ ప్రకటన వచ్చి ఏడాది అయినప్పటికీ ఈ చిత్రం గురించి ఎటువంటి అప్డేట్ లేకపోడవంతో ఫ్యాన్స్ నిరాసచెందుతున్నారు. ఈ తరుణంలోనే ఈ మూవీ తేరీ రీమేక్ అంటూ నెట్టింట పెద్ద రచ్చే నడిచింది. ఇక ఇలాంటి తరుణంలోనే హరీశ్, పవన్ ను హరిహరవీరమల్లు సెట్లో కలిసి కాస్త సందడి చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా హరీశ్ నెట్టింట అభిమానులతో పంచుకున్నారు.

సరిగ్గా ఈ సమయంలోనే ఈ సినిమాకు సంబంధించి సరికొత్త అప్‌డేట్‌తో వచ్చేసింది. సినిమా టైటిల్‌ను ‘ఉస్తాద్ భగత్‌సింగ్’గా మారుస్తున్నట్టు ప్రకటిస్తూ టైటిల్, పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అలాగే, ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే ట్యాగ్‌లైన్‌ కూడా జోడించింది. త్వరలోనే సినిమా చిత్రీకరణ మొదలవుతుందని పేర్కొంది. ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, అయాంక్ బోస్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సీనియర్ దర్శకుడు దశరథ్ స్క్రిప్ట్ వర్క్‌లో పనిచేస్తున్నారు.

ఇదీ చదవండి: భవదీయుడు భగత్ సింగ్ తమిళ రీమేక్ సినిమానా? తేరీ రీమేక్ వద్దంటూ ట్విట్టర్ ట్రెండ్ .. రియాక్టయిన హరీష్ శంకర్

Exit mobile version