Site icon Prime9

Pawan Kalyan : ” హరిహర వీర మల్లు ” మూవీ నుంచి పవన్ స్టార్ న్యూ లుక్ లీక్

pawan-kalyan-latest-pic-from-harihara-veeramallu-goes-viral

pawan-kalyan-latest-pic-from-harihara-veeramallu-goes-viral

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్… ఈ ఒక్క పేరు చాలు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడానికి. ప్రస్తుతం ఒక వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో పవన్ చాలా బిజీగా ఉంటున్నారు. రాజకీయాల కారణంగా సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ సినిమాల్లోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస సినిమాల్లో నటిస్తూ బ్లాక్ బస్టర్ హిట్ లను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఆయన లేటెస్ట్ సినిమాలు వకీల్ సాబ్, బీమ్లా నాయక్ మంచి హిట్ ను సాధించాయి. ఇప్పుడు అదే ఫామ్ ను కొనసాగిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు కళ్యాణ్ బాబు.

ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “హరిహర వీరమల్లు” సినిమాలో పవన్ నటిస్తున్నారు. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా మొఘలుల కాలంనాటి కథాంశంతో తెరకెక్కుతుంది. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ విడుదల కానుంది. కాగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల పవన్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అయిన వీడియో గింప్ల్ యూట్యూబ్ ని షేక్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాలోని కీలక యుద్ధ సన్నివేశాలను ఘాట్ చేస్తున్నారని సమాచారం అందుతుంది.

అయితే తాజాగా ఈ సన్నివేశాలకు సంబంధించి పవన్ పిక్ ఒకటి వైరల్ అవుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానితో దిగినబ ఫోటోను సోషల్ ,మీడియా లో షేర్ చేయడంతో ఈ ఫోటో ట్రెండింగ్ గా మారింది. ఆ ఫోటోలో పవన్ గడ్డంతో, యోధుడి గెటప్ లో ఉండడం చూసి ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతుంది.

Exit mobile version