Site icon Prime9

Pawan Kalyan: 20 ఏళ్ల తర్వాత.. పవన్ కళ్యాణ్ బ్యాక్ టు మార్షల్ ఆర్ట్స్..!

pawan-kalyan-doing-martial-arts-after-20 years for hariharaveeramallu

pawan-kalyan-doing-martial-arts-after-20 years for hariharaveeramallu

 Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో ఫుల్ జోష్ ఉంటుంది. కాగా పవన్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ప్రస్తుతం ఈ చిత్రం రామోజీఫిల్మ్ సిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది క్రిష్ జాగర్లమూడీ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందించబడుతున్న ఈ సినిమాలో పవన్ తన న్యూ లుక్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

పీరియాడికల్ ఫిక్షన్ కథ నేపథ్యంలో ఈ సినిమా రానుండడంతో పవన్ ఈ మూవీతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో అని అందరూ ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా చూస్తున్నారు. ఇదిలా ఉండగా, పవన్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ ఫోటో షేర్ చేశారు. అది ప్రస్తుతం నెట్టింట ఫుల్ బజ్ క్రియేట్ చేస్తోంది. దాదాపు 2 దశాబ్దాల తరువాత పవన్ కళ్యాణ్ మరల అలా చూస్తున్నందుకు అభిమానులు ఎంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పవన్ తాజాగా తాను ఇదివరకు నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ను మెరుగులు దిద్దుతూ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.

గతంలో జానీ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ చేస్తూ కనిపించిన పవన్, తిరిగి ఇన్నాళ్లకు ఇలా ప్రాక్టీస్ చేస్తూ కనిపించడంతో అభిమానులు ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు. అయితే పవన్ మళ్లీ ఇన్నాళ్లకు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తుంది హరిహర వీరమల్లు కోసమేనా అనే అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా తమ అభిమాన హీరో మరోసారి తనదైన స్టైల్లో ఫైట్స్‌ చేసి ప్రేక్షకులను మెప్పించనున్నాడంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ మరల మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చెయ్యడాన్ని కొనియాడుతూ డైరెక్టర్ క్రిష్ ట్వీట్ చేశారు. హరిహరవీరమల్లు కోసం పవన్ చూపిస్తున్న డెడికేషన్ చూసి సంబ్రమాశ్చర్యాలకు గురయ్యారు. సార్, మా #HariHaraVeeraMallu సెట్స్‌లో ముందు వరుసలో ఉంచి మీ అత్యున్నతమైన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను ప్రేక్షకుడిగా చూడడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు మరియు ప్రేక్షకులు మీ కృషి, పట్టుదల.. పనిపట్ల ఉన్న అంకితభావాన్ని చూసేందుకు ఎదురుచూస్తున్నారంటూ క్రిష్ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: హరిహరవీరమల్లు సెట్ లో హరీశ్ శంకర్.. పవన్ లుక్స్ కిర్రాక్

Exit mobile version