Site icon Prime9

BRO Teaser: “బ్రో” టీజర్ వచ్చేసింది.. సినిమాలు ఎక్కువగా చూస్తావేంట్రా నువ్ అంటూ అదరగొట్టిన మామాఅల్లుడు

Bro teaser

Bro teaser

BRO Teaser: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మామా మేనల్లుడు కలయికలో తెరకెక్కుతున్న మెగా మల్టీస్టారర్ మూవీ ‘బ్రో’. ఈ సినిమా తమిళ చిత్రం ‘వినోదయ సిత్తం’కి రీమేక్ గా తెరకెక్కుతుంది. తమిళంలో స్వీయ నటన, దర్శకత్వం వహించిన సముద్రఖనినే తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాను వచ్చే నెల జులై 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు చిత్ర యూనిట్. దానితో ఈ మూవీ టీం ప్రమోషన్స్ మొదలుపెట్టింది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి పవన్ అండ్ తేజ్ కి సంబంధించిన పోస్టర్స్ ని రిలీజ్ చేయగా వాటికి అదిరిపోయే రెస్పాన్స్ అందింది. ఇక తాజాగా టీజర్ ని విడుదల చేసింది మూవీ యూనిట్. ఈ టీజర్ డబ్బింగ్ ని కూడా పవన్ కళ్యాణ్ జూన్ 28న మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. దర్శకుడు సముద్రఖని ఆధ్వర్యంలో దీనికి డబ్బింగ్ చెప్తూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ చిన్న వీడియో నెట్టింట తెగ చెక్కర్లు కొట్టింది. దీన్ని చూసిన పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. మామాఅల్లుడు కలిసి ఈ జులైలో థియేటర్లో సందడి చేయనున్నారు. కాగా ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. టీజర్ కి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది.

టీజర్ అదిరిపోయింది(BRO Teaser)

ఇక టీజర్ విషయానికి వస్తే ఏంటి.. ఇంత చీకటిగా ఉంది.. ఎవరైనా ఉన్నారా.. హలో మాస్టరూ.. గురువు గారు.. తమ్ముడు.. బ్రో” అని తేజ్ కేకలు పెడుతున్న డైలాగుతో టీజర్ ప్రారంభమయ్యింది. ఇక పిలిచిన ప్రతిసారి పవన్ ఎలివేషన్ షాట్స్ అయితే మామూలుగా లేవనుకోండి. టీజర్ మొత్తం చాలా ఫన్ రైడ్ గా సాగింది. కాలం.. అందని ఇంద్రజాలం.. సినిమాలు ఎక్కువగా చూస్తావేంట్రా నువ్ అని పవన్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మామఅల్లుళ్ళు మాత్రం టీజర్ లో అదరగొట్టారనుకోండి. కోపధారి మనిషిగా తేజ్ కనిపించగా.. ఇంకా అతనిని రెచ్చగొట్టే కాలంగా పవన్ కళ్యాణ్ కనిపించాడు. ప్రమాదంలో చనిపోయిన తేజ్ కు మరో ఛాన్స్ ఇవ్వడానికి భూమి మీదకు దిగివచ్చిన దేవుడుగా పవన్ ఈ సినిమాలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇక రెండో ఛాన్స్ వచ్చాక తేజ్ ఏం చేస్తాడు.. తన జీవితంలో ఎలాంటి మార్పును తెచ్చుకున్నాడు..? అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Exit mobile version