Site icon Prime9

Waltair Veerayya : మెగాస్టార్ చిరు ” వాల్తేరు వీరయ్య ” రిలీజ్ డేట్ ఫిక్స్

megastar-chiranjeevi-waltair-veerayya-release-date-announced

megastar-chiranjeevi-waltair-veerayya-release-date-announced

Waltair Veerayya:  మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే గాడ్ ఫాదర్ గా వచ్చిన చిరు బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. కాగా మళ్ళీ అదే ఫామ్ ని కొనసాగిస్తూ తన లేటెస్ట్ మూవీతో వచ్చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి ” వాల్తేరు వీరయ్య ” అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ మూవీలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించనుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక వాల్తేరు వీరయ్య సినిమా నుంచి వచ్చిన బాస్ పార్టీ లిరికల్ వీడియోకు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి అఫీషియల్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మూవీ మేకర్స్.

మొదటి నుంచి ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి లో ఉన్నారు. కాగా ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాను జనవరి 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో చిరు మాస్ లుక్ లో దుమ్మురేపుతున్నారు. సముద్రం మధ్యలో బోట్ పై వేటకు వెళ్తున్న పోస్టర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

Exit mobile version