Site icon Prime9

Mahesh Babu: మహేష్ ఈజ్ బ్యాక్.. త్వరలో షూటింగ్ సెట్స్ పై ప్రిన్స్

mahesh-babu-getting-ready-for-shooting #SSMB28

mahesh-babu-getting-ready-for-shooting #SSMB28

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఇటీవల తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందడంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయాడు. ఈ ఏడాదిలో వరుసగా తన కుటుంబ సభ్యులైన అన్న అమ్మ తండ్రి ఇలా తన హృదయానికి చేరువైన ముగ్గురిని కోల్పోయిన మహేష్ తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయారు. కాగా తాజాగా కృష్ణ గారికి సంబంధించిన ఆచార కార్యక్రమాలను మహేష్ పూర్తిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే త్వరలో మహేష్ సెట్స్ పైకి రానున్నట్టు ప్రచారం జరుగుతుంది.

అయితే మహేష్‌కు ఇలాంటి ఆపత్కాలంలో దర్శకుడు త్రివిక్రమ్ తోడుగా నిలుస్తున్నాడు. ఆయన వెంటే ఉంటూ మహేష్‌కు ధైర్యాన్ని ఇస్తున్నాడు. పైకి ఎంత ఆనందంగా అందరినీ పలకరిస్తున్నా లోలోపల కుంగిపోతున్న మహేష్ ఇంట్లో ఒంటరిగా ఉండడం కంటే సెట్స్ ఉండడం మేలని త్రివిక్రమ్ మరియు ఆయన కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో #SSMB28 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే కాగా మహేష్ ఇంట వరుస విషాదాలు నెలకొంటున్న సమయంలో ఈ షూట్ కాస్త లేట్ అవుతూ వస్తోంది. కాగా తాజాగా వచ్చేనెల మొదటి వారంలో ఇక షూటింగ్స్ ని తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారట మాటల మాంత్రికుడు. మరి దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో అవుతుంది.

ఇదీ చదవండి:  ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటా.. కృతిసనన్ క్లారిటీ

Exit mobile version