Site icon Prime9

Jr NTR: నెట్టింట వైరల్ అవుతున్న ఎన్టీఆర్ న్యూ లుక్.. ఎందుకో తెలుసా..?

Jr NTR new look goes viral

Jr NTR new look goes viral

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరుకు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎల్లలు దాటిన అభిమానం ఎన్టీఆర్ సొంతం. కాగా ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ న్యూ లుక్ ఒకటి నెట్టింట వైరల్ గా మారుతోంది. కొత్త తరహా గెటప్‌లోకి మారిన ఎన్టీఆర్ యొక్క ఈ లుక్ ఆయన చేయబోయే కొత్త సినిమా కోసమానా? లేక మరేదైనా రీజన్ ఉందా అనే ప్రశ్న ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మరి తాజాగా వైరల్ అవుతున్న ఎన్టీఆర్ లుక్ గమనిస్తే కళ్లజోడు పెట్టుకొని ఎంతో స్టైలిష్ లుక్ లో దర్శనమిస్తున్నారు. ఎన్టీఆర్ లుక్ కు సంబంధించి బాలీవుడ్ హెయిర్ స్టైలిష్ట్ అలీమ్ హకీమ్ ఓ పోస్ట్ షేర్ చేశారు.

Image

ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ ఈ లుక్ లోకి మారడానికి ఒక వాణిజ్య ప్రకటన కారణమని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలంతా అటు సినిమాలు ఇటు యాడ్స్ తో ఫుల్ బిజీ అవుతున్నారు. అదే కోణంలో ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఓ బడా సంస్థతో డీల్ కుదుర్చుకొని ఇలా న్యూ లుక్ లోకి ట్రాన్స్ ఫామ్ అయ్యారని తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోల్లో కెల్లా ఎన్టీఆర్ క్రేజ్ ప్రత్యేకం. ఆయన సినిమా వస్తుందంటే చాలు అన్ని వర్గాల ఆడియన్స్ లో ఆనందం కనిపిస్తుంటుంది. హీరోగా ఎన్నో విజయాలందుకున్న ఈ నందమూరి వారసుడు సినిమా సినిమాకు తనలోని డిఫరెంట్ వేరియేషన్ను బయటపెడుతుంటారు.

Image

ఇకపోతే ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయానికొస్తే కొరటాల శివ దర్శకత్వంలో ఆయన తన 30వ సినిమాలో నటించనున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు రావాల్సింది కానీ అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.

ఇదీ చదవండి: చైతూ 22వ సినిమా పేరు రివీల్.. పోస్టర్ రిలీజ్

Exit mobile version
Skip to toolbar