Site icon Prime9

Allu Aravind: “మా అబ్బాయితో డేటింగ్ చేస్తున్నావా” అని అడిగిన అల్లు అరవింద్

anu emmanuel said about her dating issue

anu emmanuel said about her dating issue

Allu Aravind: నటన ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తున్నా పెద్దగా హిట్ అందుకోలేకపోతుంది టాలీవుడ్‌ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యూయేల్‌. నానికి జోడీగా నటించిన‘మజ్ను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైయ్యింది ఈ బ్యూటీ. కాగా అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోలైన అల్లు అర్జున్‌, పవన్‌ కళ్యాణ్‌లతో సినిమాల్లో నటించే చాన్స్ కొట్టేసింది. అయితే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడడంతో ఈమె అందాలరాశికి అవకాశాలు తగ్గాయి. ఇక చాలా గ్యాప్ తర్వాత తాజాగా ఈమె అల్లు శిరీష్‌తో కలిసి ‘ఊర్వసివో రాక్షసివో’లో నటించించింది. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో రిలీజై పాజిటీవ్‌ టాక్‌ తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే ఓ వైపు గత కొంత కాలంగా అను ఇమ్మాన్యూయేల్‌, అల్లు శిరీష్‌లు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ వార్తలపై వాటిపై స్పందించింది అను. ఊర్వసివో రాక్షసివో సినిమాలో నటించడానికి ముందు అల్లు శిరీష్‌ను రెండు సార్లు మాత్రమే కలిసానని ఈ మధ్య కాలంలో ఈ సినిమా గురించి మాట్లాడుకోవడానికి ఓ కాఫీ షాపులో శిరీష్‌ను కలిసినట్లు చెప్పింది. ఈ నేపథ్యంలోనే అలా కాఫీ షాపులో కలుసుకున్న ఫోటోలు బయటకు రావడంతో మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ ప్రచారం అయ్యాయని ఆమె తెలిపింది.

ఇలాంటి రూమర్స్ ని తాను సీరియస్ గా తీసుకోలేదని కానీ మా అమ్మ ఈ వార్తలు విని చాలా అప్సెట్ అయ్యిందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అల్లు అరవింద్‌ ఒకరోజు తనను ఇంటికి పిలిచి మరీ శిరీష్‌తో డేటింగ్‌ రూమార్స్ గురించి అడిగారట. ఏంటి మా అబ్బాయితో డేటింగ్ లో ఉన్నావా అంటూ సరదాగా అడిగారని తెలిపింది. ఇంక ఈ విషయంపై ఇద్దరు కాసేపు నవ్వుకున్నట్లు చెప్పింది.

ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన “బ్రహ్మాస్త్ర”.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే..?

Exit mobile version