Site icon Prime9

Rana Daggubati: ఇండిగోపై ఫైర్ అయిన హీరో రానా.. క్షమాపణలు చెప్పిన ఎయిర్ లైన్స్

Actor Rana Daggubati slams IndiGo for 'worst experience'; airline apologises

Actor Rana Daggubati slams IndiGo for 'worst experience'; airline apologises

Rana Daggubati: టాలీవుడ్‌ స్టార్‌ నటుడు రానా దగ్గుబాటికి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ లో ఘోర సంస్థ తాజాగా క్షమాపణలు చెప్పింది. లగేజ్‌ మిస్‌ విషయమై ఇండిగో ఎయిర్‌ లైన్స్‌ సంస్థపై రానా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తన లగేజ్‌ మిస్‌ అయిందని, అక్కడి సిబ్బంది దాన్ని వెతికిపట్టుకోలేకపోయారని ట్వీట్టర్‌ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘భారత్ దేశంలోనే అత్యంత చెత్త ఎయిర్ లైన్స్ సర్వీస్ అనుభవం. ఇండిగో.. ఫ్లయిట్ టైమింగ్స్ గురించి తెలియదు. పోయిన లగేజ్ ను గుర్తించలేరు. సిబ్బందికి దీని గురించి తెలియదు. ఇంతకంటే దిక్కుమాలిన సేవ ఉంటుందా? అంటూ ట్విట్టర్ లో రానా పేర్కొన్నారు. కాగా ఈ విషయమై రానాకు ఇండిగో క్షమాపణలు చెప్పింది. ‘సర్, మీ లగేజ్‌ మీతో పాటు విమానంలో రాకపోవడం వల్ల కలిగిన అసౌకర్యాన్ని మేము అర్థం చేసుకున్నాం. మీకు కలిగిన అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాం. మీ లగేజ్ మీకు వీలైనంత త్వరగా అందిస్తామని హామీ ఇస్తున్నాం. ఇందుకోసం మా బృందం పని చేస్తోంది’ అంటూ ఇండిగో సంస్థ ట్వీట్‌ చేసింది.

ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి రానా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లారు కాగా బెంగళూరు సర్వీసు ఆలస్యమవుతుందని, మరో విమానంలో వెళ్లాల్సిందిగా సిబ్బంది వారికి సూచించారు. లగేజ్‌ కూడా అదే విమానంలో పంపిస్తామని చెప్పారు. వారు చెప్పినట్టే రానా కుటుంబం బెంగళూరు వెళ్లింది. కానీ లగేజ్‌ మాత్రం రాలేదు. ఈ విషయమై విమానాశ్రయ సిబ్బందిని రానా ప్రశ్నించారు. కానీ వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దానితో రానా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: బంగారం ఇచ్చే ఏటీఎం.. ఎక్కడో తెలుసా..?

Exit mobile version