Ram Gopal Varma: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా విమర్శలు కురిపించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల భేటీపై ట్విట్టర్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు .. RIP కాపులు , కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు’’ అంటూ రామ్ గోపాల్ (Ram Gopal Varma) ట్వీట్ చేశారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తులపై చర్చ..
ఆదివారం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆయనతో సమావేశమయిన విషయం తెలిసిందే. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం ఇద్దరు నేతలు ఉమ్మడిగా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఏపీ సర్కార్ జారీ చేసిన వివాదాస్పద జీవో నెంబర్ 1 ప్రభుత్వ వ్యతిరేకతను అణిచివేయడం మొదలైన వాటితో సహా పలు సమస్యలపై వారు చర్చించినట్లు తెలిసింది. అయితే ఎన్నికల పొత్తులపై తర్వాత చర్చిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు.
పవన్ కళ్యాణ్ పై నెట్టింట ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
రాజకీయాల్లో పొత్తులు సహజమని.. సమీకరణాలను బట్టి పొత్తులు ఉంటాయని చెప్పారు. 2009లో టీఆర్ఎస్‌తో టీడీపీ పొత్తుపెట్టుకుందని గుర్తుచేశారు. ఆ తర్వాత విభేదించామని చెప్పారు. రాజకీయాల్లో ఎప్పుడూ ఏ నిర్ణయాలు తీసుకునే దానిపై తమ వ్యుహాలు తమకు ఉంటాయని చెప్పారు. గతేడాది అక్టోబర్‌లో విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. చంద్రబాబు నాయుడు ఆయనను విజయవాడలోని హోటల్‌లో కలిసి సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. ఇపుడు పవన్ చంద్రబాబు కుప్పం పర్యటన తరువాత ఆయనను వెళ్లి కలిసారు. వీరిద్దరి భేటీపై వైసీపీ మంత్రులు కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.
కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని ,కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు ..RIP కాపులు , కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు 😔😔😔
— Ram Gopal Varma (@RGVzoomin) January 8, 2023
ఇవి కూడా చదవండి:
Waltair Veerayya: లక్ష్మణరేఖనైనా దాటుతాను కానీ సురేఖను దాటను.. సుమ అడ్డాలో చిరు కామెంట్స్
Nandamuri Balakrishna : తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి ఓపెన్ అయిన బాలకృష్ణ..
KGF 3: 2025లో సెట్స్ పైకి వెళ్లనున్న KGF 3.. మరోసారి రాకీభాయ్ గా కనిపించనున్న హీరో యష్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/