Site icon Prime9

Shaakuntalam: సమంత ‘శాకుంతలం’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

Shaakuntalam Movie

Shaakuntalam Movie

Shaakuntalam: నటి సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. పాన్ ఇండియా లెవల్ లో తెరకిక్కిన ఈ మైథాలాజికల్ ఫిల్మ్ ఫిబ్రవరి 17 న రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా శాకుంతలం కొత్త రిలీజ్ తేదీని వెల్లడించారు నిర్మాతలు. ప్రపంచ వ్యాప్తంగా వేసవి కానుకగా ఏప్రిల్ 14 న శాకంతలం విడుదల కానుందంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

రెండోసారి వాయిదా(Shaakuntalam)

సినిమా కు సంబంధించిన పోస్ట్ ప్రొడెక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేసినట్టు వార్తలు వస్తున్నాయి. శాకుంతం సినిమా విడుదల వాయిదా పడటం ఇది రెండోసారి. లాస్ట్ నవంబర్ లోనే అ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు మేకర్స్. కానీ అపుడు వివిధ కారణాలతో ఫిబ్రవరి కి వాయిదా వేశారు. తాజాగా మరోసారి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ కు మారింది.

శాకుంతలంపై భారీ అంచనాలు

మైథలాజికల్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. రుద్రమదేవి తర్వాత గుణశేఖర్‌ ఈ సినిమా కోసం దాదాపు ఏడేళ్ళ సమయం తీసుకున్నాడు. ఇక ఈ సినిమాను ప్ర‌ముఖ క‌వి కాళిదాసు ర‌చించిన సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకుని.. గుణ శేఖ‌ర్‌ ఈ సినిమాని తీస్తున్నారు.

 

హిందూ ఇతిహాసాలు ఆధారంగా దేవకన్య అయిన మేనకకి పుట్టిన ‘శకుంతల’ పాత్రలో సమంత కనిపించబోతుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ప్రిన్స్ ‘భారత’ పాత్రలో నటిస్తుంది. మోహన్ బాబు, మధూ, గౌతమి, అధితి బాలన్ మరియు అనన్య నాగళ్ల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా ప్రచార పోస్టర్లు, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

 

Exit mobile version