Site icon Prime9

Rangamarthanda On OTT: అమెజాన్ లో రంగమార్తాండ స్ట్రీమింగ్..

Rangamarthanda On OTT

Rangamarthanda On OTT

Rangamarthanda On OTT: ఆరేళ్ల విరామం తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ’. గులాబీ , నిన్నే పెళ్లాడతా , ఖడ్గం, మురారి లాంటి హిట్ చిత్రాలను అందించిన కృష్ణ వంశీ చాలా గ్యాప్ తర్వాత రంగ మార్తాండతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, హాస్యనటుడు బ్రహ్మానందం.. నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది రంగమార్తాండ. టీజర్, ట్రైలర్ తో కుటుంబ కథా చిత్రంగా సినిమా పై మంచి క్రేజ్ ను క్రియేట్ చేశారు. విడుదలకు ముందే ఏకంగా ప్రీమియర్లు వేసి.. సినిమాపై మంచి కాన్ఫిడెంట్ వాతావరణాన్ని సృష్టించారు చిత్ర మేకర్స్.

మరాఠిలో సంచలన విజయం సాధించిన ‘నట సామ్రాట్’ అనే సినిమాను తెలుగులో రంగమార్తాండగా రీమేక్ చేసారు కృష్ణవంశీ. ఉగాది సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది. ఎలాంటి హడావిడి లేకుండా వచ్చి మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధం అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఏప్రిల్ 7 నుంచి అందుబాటులోకి వచ్చింది. ముందుగా ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ సినిమా డిజిటల్‌లోకి వచ్చింది. ఈ సినిమాలో శివాత్మిక రాజశేఖర్‌, రాహుల్‌ సిప్లీగంజ్‌ కీలక పాత్రలను పోషించారు.

 

రంగమార్తాండ కథ ఏంటంటే..(Rangamarthanda On OTT)

రంగ‌స్థలంపై ఎన్నో పాత్రల‌కి జీవం పోసి ర‌క్తి క‌ట్టించిన ప్రకాశ్‌రాజ్‌. నాట‌క‌రంగ‌మే ప్రపంచంగా బ‌తికిన ఆయ‌న‌కి రంగ‌మార్తాండ అనే బిరుదుని ప్రదానం చేస్తారు. ఆయ‌న స్నేహితుడు బ్రహ్మానందం కూడా రంగ‌స్థల న‌టుడే. ఇద్దరూ క‌లిసి దేశ విదేశాల్లో ప్రదర్శన‌ల‌తో అందరి మన్ననలు అందుకున్నారు. జీవితంలో ఒకరికొకరు క‌ష్టసుఖాల్లో పాలు పంచుకుంటారు. తనకి రంగ‌మార్తాండ బిరుదు వచ్చిన తర్వాత ఆ వేదిక‌పైనే నాట‌క రంగం నుంచి రిటైర్ మెంట్ ప్రకటించి. సంపాదించినది అంతా వార‌సుల‌కి ఇచ్చేస్తాడు ప్రకాశ్ రాజ్. అక్కడి నుంచి ఆయ‌న కొత్త జీవితంలో అడుగు పెడతాడు. అయితే ఆ జీవితంలో ఆయనకు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? రంగ‌స్థలంపై పోషించిన ప్రతిపాత్రనీ ర‌క్తి క‌ట్టించిన ప్రకాశ్ రాజ్ నిజ జీవితంలో ఏం నేర్పింది? అనే ఆసక్తికర అంశాలతో రంగమార్తాండ తెరకెక్కింది.

 

 

Exit mobile version