Site icon Prime9

Prabhas: ప్రభాస్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌.. ప్రాజెక్ట్ K నుంచి స్పెషల్ అప్ డేట్

Prabhas

Prabhas

Prabhas: నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘ప్రాజెక్ట్ K’. ఈ సినిమాలో దీపికా పడుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా సూపర్ స్టార్ అమితా బచ్చన్ కీ రోల్ చేస్తున్నారు.

ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సన్నాహాలు చేస్తోంది.

అయితే తాజాగా మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ అభిమానుల కోసం చిత్ర యూనిట్ ప్రాజెక్ట్ K ప్రచార పోస్టర్ ను రిలీజ్ చేసింది.

ఈ చిత్రంలో ఒక భారీ చేయి ఉండగా.. ముగ్గురు వ్యక్తులు గన్స్ చేతి వైపు గురి పెడుతూ నిలబడ్డారు.

ది వరల్డ్ ఈజ్ వెయిటింగ్ అంటూ ట్యాగ్ రాసున్న ఈ పోస్టర్ చూస్తుంటే.. మంచి యాక్షన్ సినిమాను గుర్తుచేసేలా ఉంది ఈ పోస్టర్.

ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకొచ్చే అవకాశాలున్నట్టు సమాచారం. విభిన్న కథాంశంతో.. అత్యాధునిక హంగులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

భారీ అంచనాలు(Prabhas)

దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమాలోని ఒక వెహికల్ కోసం భారీ చక్రాన్ని తయారు చేస్తున్న వీడియోను రిలీజ్ చేశారు.

తర్వాత హీరోయిన్ దీపికా పడుకోణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టీం ఆమెకు సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చింది.

సోషల్ మీడియా వేదికగా దీపిక క్యారెక్టర్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో దీపిక ముఖం కనిపించకుండా డిజైన్ చేశారు.

అలాగే పోస్టర్ మీద ‘చీకటిలో ఆమె ఒక ఆశ’అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ తో దీపికా అభిమనులంతా ఫుల్ ఖుషి అవుతున్నారు.

వైజయంతీ బ్యానర్స్ పై 100 వ చిత్రంగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమా ఉండనుందని నాగ్ అశ్విన్ చెబుతున్నారు.

 

ఏడాదంతా ప్రభాస్ సందడి

మరోవైపు ప్రభాస్‌ అభిమానులకు మాత్రం ఈ ఏడాది బ్లాక్‌ బస్టర్‌ బొనాంజాగా ఉండబోతోంది. ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్‌ ఫిల్మ్‌‘ఆది పురుష్‌’.

ప్రభాస్‌ ఈ మూవిలో రాముడిగా నటిస్తుండగా, సీత పాత్రలో కృతి సనన్‌ కనిపించనుంది. రావణ్‌ పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు. ఈ సినిమాను వేసవి కానుకగా జూన్‌ 16న విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌’.

హీరోయిన్ గా శ్రుతిహాసన్‌ చేస్తుండగా.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. హోంబాలే ఫిల్మ్‌ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా కూడా రెండు భాగాలుగా వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించి రిలీజ్‌ డేట్స్‌ను ప్రకటించారు నిర్మాతలు.

ఇప్పుడు ‘ప్రాజెక్ట్‌-కె’ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.

దీంతో ప్రతి నాలుగు నెలలకు ఒక సారి ప్రభాస్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు మారుతీ దర్శకత్వంలోనూ ప్రభాస్‌ మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version