Site icon Prime9

Salaar : బాక్సాఫీస్ ఊచకోతకు రెడీ అంటున్న ప్రభాస్.. “సలార్” మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ !

prabhas salaar movie trailer

prabhas salaar movie trailer

Salaar : పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. కెజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న చిత్రం “సలార్”. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా కనిపించబోతున్నారు. టినూ ఆనంద్‌, ఈశ్వరి రావు, శ్రేయా రెడ్డి, మధు గురుస్వామి, పృథ్వీరాజ్‌, ఝాన్సీ, బ్రహ్మాజీ, జెమిని సురేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బ్రసూర్‌ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. `కేజీఎఫ్‌`ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ దీన్ని నిర్మిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్‌ చేయబోతున్నారు.

బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ మిగల్చడంతో అభిమానులంతా ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటి దాకా ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దాంతో ఈ మూవీ రిలీజ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన సలార్‌ సినిమా అనూహ్యంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా సలార్ రిలీజ్ డేట్ గురించి తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మూవీ మేకర్స్ పై కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా తాజాగా సలార్ రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ ఇచ్చి ఫ్యాన్స్ ని కూల్ చేశారు.

లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తామంటూ మగతా హీరోలకు వార్నింగ్ బెల్ ఇస్తున్నారు ప్రభాస్. తాజాగా సోషల్ మీడియా వేదికగా సలార్‌ (Salaar) రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు చిత్రబృందం. డిసెంబర్ 22 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రభాస్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఒంటినిండా ర‌క్తంతో చేతిలో క‌త్తి ప‌ట్టుకొని ప్ర‌భాస్ క‌నిపిస్తోన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 

 

అయితే క్రిస్మస్ కానుకగా షారూఖ్ ఖాన్ “డుంకీ”, పలు చిత్రాలు రేస్ లో ఉన్నాయి.  మరి ప్రభాస్ మూవీ రిలీజ్ అవుతున్న క్రమంలో వారి సినిమాలు వాయిదా వేసుకోక తప్పదనే చెప్పాలి. 2018లో KGF ఛాప్టర్ 1 సినిమాని షారుఖ్ ఖాన్ జీరో మూవీకి పోటీగా రిలీజ్ చేసిన ప్రశాంత్ నీల్.. ఈసారి సలార్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయాలని చూస్తున్నాడు.

 

Exit mobile version