Site icon Prime9

Aryan Khan: షారుఖ్ ఖాన్ తనయుడి బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్.. కానీ హీరోగా కాదు..!

aryan khan bollywood entry fix

aryan khan bollywood entry fix

Aryan Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి తెలియని వారుండరు. ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల్లో షారుఖ్ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలాంటి బాద్షా వారసుడైన ఆర్యన్ ఖాన్ కొన్నాళ్ల క్రితం డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కయ్యి జైలుకెళ్ళొచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆర్యన్ వార్తల్లోకెక్కి ట్రెండింగ్ గా నిలిచాడు. ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇద్దామనుకునే సమయంలోనే అతను అరెస్ట్ తో కొన్ని రోజులు ఆర్యన్ ఖాన్ సైలెంట్ అయిపోయాడు. కాగా ఇప్పుడు ఆర్యన్ బాలీవుడ్ డెబ్యూకి సమయం ఆసన్నమైంది. షారుఖ్ ఖాన్ ఓన్ ప్రొడక్షన్ హౌస్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ అతడి అరంగేంట్రానికి వేదికగా మారింది.

బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ తనయుడు అతి త్వరలో బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్యన్ ఖానే వెల్లడించారు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. తండ్రి షారుఖ్ తరహాలో ఆర్యన్ హీరోగా తెరమీద కనిపించకుండా తెరవెనుక ఉండనున్నాడు. నటుడిగా కాకుండా రచయితగా, దర్శకుడిగా బాలీవుడ్ కు పరిచయం అవుతుండడం టాక్ ఆఫ్ బాలీవుడ్ అయింది.

ఆర్యన్ ఖాన్ ను బాలీవుడ్ లో హీరోగా పరిచయం చేయడానికి కరణ్ జోహార్ రెండు సార్లు ట్రై చేశాడు. అయితే ఆర్యన్ మనసు మాత్రం మార్చలేకపోయాడు. తనకి రైటర్ గా ఇంట్రడ్యూస్ అవడమే ఇష్టమంటూ కుండబద్దలు కొట్టేశాడు. దాంతో ఆర్యన్ ఖాన్ అభిరుచికి తగ్గట్టు అతడ్ని రైటర్ గానే ప్రోత్సహించారు షారుఖ్ దంపతులు. ఆర్యన్ రైటర్ గా తన బాలీవుడ్ డెబ్యూ గురించి సోషల్ మీడియాలో అఫీషియల్ గా ప్రకటించడం ఆసక్తిగా మారింది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఆర్యన్ తొలి ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఆల్రెడీ స్క్రిప్ట్ రాయడం పూర్తి అయ్యిందని తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తాను రాసిన స్క్రిప్ట్ నోట్ బుక్ షేర్ చేసిన ఆర్యన్ ”రైటింగ్ కంప్లీట్ అయ్యింది.. త్వరలో యాక్షన్ చెప్పాలని ఎదురు చూస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు. మొత్తానికి బాలీవుడ్ సూపర్ స్టార్ తనయుడు ఆర్యన్ మరి ఏ రేంజ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.. సక్సెస్ కొడతాడో లేదో చూడాలి.

aryan khan

ఇదీ చదవండి: 20 ఏళ్ల తర్వాత.. పవన్ కళ్యాణ్ బ్యాక్ టు మార్షల్ ఆర్ట్స్..!

Exit mobile version