Site icon Prime9

Balakrishna: నా గురించి రాసే దమ్ము ఎవరికి ఉంది- అఫైర్స్ పై బాలకృష్ణ ఊరమాస్ ఆన్సర్

balakrishna says-no-one-had-dare-to-write-rumors-on-me

balakrishna says-no-one-had-dare-to-write-rumors-on-me

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా మాత్రమే కాకుండా ఇటీవల యాంకర్ గానూ ఎంతో మంచి ఆదరణ పొందుతున్నారు. ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా బాలయ్యబాబు ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఈ కార్యక్రమం మొదటి సీజన్ అఖండ విజయం నమోదు చెయ్యడం వల్ల రెండో సీజన్ కూడా అంతే ఘనంగా ప్రారంభించారు. కాగా ఇప్పటికే ఈ సీజన్ లో రెండు ఎపిసోడ్లను పూర్తి అయ్యాయి. ఇక ఈ కార్యక్రమం మూడవ ఎపిసోడ్ లో భాగంగా నిన్న శుక్రవారం నాడు యంగ్ హీరోలు అడివి శేష్ మరియు శర్వానంద్ లు హాజరయ్యారు.

ఇకపోతే ఈ యంగ్ హీరోలతో కలిసి బాలయ్య చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా శర్వానంద్ బాలకృష్ణను ఓ ప్రశ్న అడిగారు. మీరు ఎంతో మంది హీరోయిన్లతో పనిచేశారు కదా మీ గురించి ఎవరితోనూ ఎలాంటి అఫైర్స్ రూమర్స్ రాలేదు.. ఎలా మేనేజ్ చేశారు అంటూ శర్వా సందేహం వ్యక్తం చేశారు. ఇక ఈ ప్రశ్నకు బాలకృష్ణ స్టన్నింగ్ సమాధానం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. మన గురించి పుకార్లు రాస్తే దమ్ము ఎవరికుంది అంటూ ఊర మాస్ లెవెల్లో జవాబు ఇచ్చారు.

అప్పట్లో సోషల్ మీడియా అంతగా లేకపోవడం వల్ల హీరో హీరోయిన్ల గురించి పుకార్లు పెద్దగా వ్యాప్తి చెందేవి కాదని ఒకవేళ ఎవరైనా జర్నలిస్టులు హీరోల గురించి ధైర్యం చేసి ఇలాంటి లవ్ ఎఫైర్స్ గురించి లేదా పుకార్ల గురించి రాయాలని ప్రయత్నించిన అవి ప్రింట్ అయ్యేవి కాదన్నారు. దానివల్ల అప్పట్లో హీరోల గురించి పెద్దగా ఇలాంటి పుకార్లు వచ్చేవి కాదని చెప్పారు. ఎవరో కొంతమందివి మాత్రమే వచ్చేవని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో ప్రతి ఒక్కరిని ఇలాంటి రూమర్స్ వెంటాడుతున్నాయని, ఎత్తున వైరల్ అవుతున్నాయని తెలిపారు.

ఇదీ చదవండి: జబర్ధస్త్ లోకి సుడిగాలి సుధీర్ రీఎంట్రీ

Exit mobile version