Site icon Prime9

Connect Movie Trailer: ట్రైలర్ తో నయనతారకు ప్రేక్షకులు “కనెక్ట్”

connect movie trailer released

connect movie trailer released

Connect Movie Triler: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఇప్పటికే పలు హారర్‌ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి వీక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైంది నయన్. లేడీ సూపర్ స్టార్ నయన్ నటించిన తాజా చిత్రం కనెక్ట్‌. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ మూవీ ట్రైలర్ వచ్చేసింది. దేశ సినీ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా అర్థరాత్రి 12 గంటలకు ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేసింది చిత్రయూనిట్‌.

అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయనతార స్వయంగా నిర్మిస్తున్న కనెక్ట్ చిత్రం డిసెంబర్‌ 22న థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు ఇంటర్వెల్ లేకపోవడం గమనార్హం. ఇక తాజాగా చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదలచేసింది చిత్ర బృందం. గురువారం అర్థరాత్రి ట్రైలర్‌ను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించారు మూవీ మేకర్స్‌. మొత్తం సినిమా 99 నిమిషాల నిడివితో ఉండనుంది. ఇక 2.22 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్‌ మొదటి నుంచి చివరి వరకు టెన్షన్‌ టెన్షన్ గా సాగుతోంది.

లాక్‌డౌన్‌ సమయంలో కరోనాకు గురైనవారికి భూతవైద్యం చేసే కథా నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ఈ సినిమా ట్రైలర్‌ చూస్తే అర్థమౌతుంది. కరోనా సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలోనే నయన తార ఆన్‌లైన్‌ మీటింగ్స్ పాల్గొనగా.. మీటింగ్లో పాల్గొన్న వారికి ఎవరో తెలియని వ్యక్తి గొంతు వినిపిస్తుంది.
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.? దెయ్యమే అదంతా చేస్తుందా.? అనే ఆసక్తికర విషయాలను ట్రైలర్‌లో చూపించారు. కాగా, ఈ చిత్రంలో సత్యరాజ్‌, అనుపమఖేర్‌, వినరురారు కీలకపాత్రలో నటించారు. పూర్తిగా హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

ఇదీ చదవండి: కేన్సర్ ను ఓడించి మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ” మిర్చి ” బ్యూటీ

Exit mobile version