Site icon Prime9

Mrunal Thakur : ట్రోలర్స్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన సీతారామం బ్యూటీ..

mrunal thakur shocking reply to trollers

mrunal thakur shocking reply to trollers

Mrunal Thakur: ” సీతారామం ” సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ” మృణాల్ ఠాకూర్ ” . మొదటి సినిమా తోనే సూపర్ విక్టరీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ… భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఈ అమ్మడికి వచ్చిందంటే నిజమానే చెప్పాలి. ఈ తరుణంలోనే మృణాల్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ఇప్పటి వరకు తెలుగులో ఏ ప్రాజెక్ట్ కి మృణాల్ ఓకే చెప్పినట్లు లేదు. దీంతో ఆ భామ అభిమనులంతా తన నెక్స్ట్ ఫిల్మ్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలోనే గత కొన్ని రోజులుగా మృణాల్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. ఇందుకు కారణం ఏంటంటే బాలీవుడ్ లో పిప్పా అనే సినిమాకు మృణాల్ ఓకే చెప్పడమే. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మృణాల్ హీరో సిస్టర్ పాత్రలో నటించనుందట. దీంతో హీరోయిన్ గా ఫామ్ లో ఉన్నప్పుడు ఇలా సిస్టర్ రోల్స్ చేయడం ఏంటని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

కాగా తాజాగా ఈ ట్రోలింగ్స్ పై మృణాల్ స్పందించింది. హీరోయిన్లు హీరోయిన్లు గానే నటించాలా… సిస్టర్, భార్య, అమ్మ లాంటి క్యారెక్టర్స్ చేయకూడదా ? అని ప్రశ్నించింది. అలాంటి పద్దతిని మనం బ్రేక్ చేసినప్పుడే మనలోని సత్తా ఏంటో తెలుస్తుంది. కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకుంటే… ఓ గొప్ప పాత్ర మిస్ చేసుకున్నాననే బాధ ఉండకూడదని తెలిపింది. ఆ సినిమాలో తన పాత్ర నచ్చడంతోనే ఓకే చెప్పినట్లు మృణాల్ వెల్లడించింది. చూడాలి మరి ఆ మూవీ మృణాల్ కి ఎంత మేర  పేరు తీసుకువస్తుందో అని.

Exit mobile version