Site icon Prime9

Megastar Chiranjeevi: “నేను రాజకీయానికి దూరం కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు” అంటున్న చిరంజీవి

god father movie first day collections

god father movie first day collections

Megastar Chiranjeevi: ‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరు హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా ‘గాడ్‌ఫాదర్‌’మూవీ తెరకెక్కుతుంది. కాగా ఈ మూవీ నుంచి తాజాగా విడుదలైన డైలాగ్ అటు అభిమానులను ఇటు రాజకీయనేతల్లోనూ మంచి పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని దసరా కానుకగా అక్టోబరు 5న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.

ఇప్పటికే విడుదల చేసిన గాడ్ ఫాదర్ మూవీ టీజర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచుతుండగా… తాజాగా ఈ చిత్రం నుంచి చిరంజీవి రాజకీయాల గురించి చెప్పిన డైలాగ్ ప్రజలముందుకు వచ్చింది. దీనిని చిరు ట్విటర్‌గా వేదికగా పంచుకోగానే నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. చిరు సినిమాలో డైలాగ్‌ చెప్పారా? లేదా సమకాలీన రాజకీయాలపై స్పందించారా? అంటూ సోషల్‌మీడియా వేదికగా చర్చ ప్రారంభం అయ్యింది.

అయితే, చిరంజీవి నటిస్తున్న ‘గాడ్‌ఫాదర్‌’ మూవీ ఫొటోతోనే ఆడియో సంభాషణ ఉండటంతో ఇది సినిమాలోని డైలాగేనని అంటున్నారు ప్రజలు. కాగా చిరు తన ట్వీట్‌కు ఎలాంటి కామెంట్‌ జోడించలేదు.

ఇదీ చదవండి: God Father Movie: “తార్ మార్ తక్కర్ మార్” వచ్చేస్తుంది… ఇక కుర్రకారుకు పూనకాలే..!

Exit mobile version