Site icon Prime9

Keerty Suresh: కీర్తి సురేష్ నయా లుక్.. ఈ మహానటి ఫొటోలు చూస్తే షాక్..!

keerty suresh new look photos viral

keerty suresh new look photos viral

Keerty Suresh: మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కీర్తి సురేష్. కాగా ఆమె ఇటీవలె చేసిన సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే తాను గ్లామర్ రోల్స్ చెయ్యడానికి రెడీ అంటూ తాజాగా సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫొటోలను విడుదల చేసింది. ఆ ఫొటోస్ చూసిన అభిమానులంతా కీర్తి నయా లుక్ పై తెగ కామెంట్లు వేస్తున్నారు. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

తెలుగు చలనచిత్ర రంగంలో సాటిలేని ముద్ర వేసిన అలనాటి సావిత్రిని ఇలనాటి కీర్తి సురేష్ ‘మహానటి’ చిత్రం ద్వారా నేటి తరానికి పరిచయం చేసిందని చెప్పవచ్చు. మహానటి విడుదలయ్యి నాలుగేళ్లు అవుతున్నా కీర్తి సురేష్ని ఇంకా మహానటి సినిమాతోనే పిలుస్తున్నారంటే ఆ చిత్రం ఆమెకు ఎంత గుర్తింపు తెచ్చిపెట్టిందో అర్ధం చేసుకోవచ్చు. మహానటి చిత్రం కీర్తిని జాతీయ అవార్డు అందుకునేలా చేసిదింది. అయితే ఆ తరువాత కీర్తి సురేష్ సినిమాలు చాలానే విడుదల అయ్యాయి కానీ, ఏ సినిమా కూడా ‘మహానటి’ అంత ప్రభావాన్ని చూపించలేకపోయాయి. ఈ ఏడాది కూడా మహేష్ బాబుతో వచ్చిన ‘సర్కారు వారి పాట’ కూడా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.

ఇదిలా ఉంటే మహానటి సినిమా తరువాత, కీర్తి సురేష్ అలంటి సినిమా అవకాశాలే వచ్చాయి. అయితే కీర్తి మాత్రం తానూ గ్లామర్ పాత్రలు చేస్తానని నిరూపించుకోవడానికి, చాల బరువు తగ్గి, చాలా అందంగా హాట్ గా తయారయింది. ఇంక ఆ ఫోటోస్ను ఆమె సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది.

కీర్తి తెలుగు లో నటిస్తున్న తాజా చిత్రం దసరా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ నాని సరసన డీ గ్లామరస్ రోల్ చేస్తుంది. ఇకపోతే చిరంజీవితో ‘భోళా శంకర్’ అనే సినిమాలో నటిస్తోంది ఈ భామ. కానీ ఇందులో కథానాయికగా కాకుండా, చిరంజీవి కి చెల్లిగా నటిస్తోంది.

ఇదీ చదవండి: ఫిలింఫేర్లో మెరిసిన “పుష్ప”.. “అల్లు” చిత్రాలకు అత్యధిక అవార్డులు

Exit mobile version