Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సామ్ శుక్రవారం రోజు తన పెంపుడు శునకం ఫొటోను షేర్ చేసి ఆ పోస్ట్‌కి ‘‘వెనక్కి తగ్గా కానీ ఓడిపోలేదు’’ అంటూ క్యాప్షన్ రాసింది. ఇంకేముందు ఎప్పుడెప్పుడు సామ్ పోస్ట్ పెడుతుందా అని ఎదురుచూసిన అభిమానులు ఈ పోస్ట్ పై స్పందించారు.
పలువురు సెలబ్రిటీలు కూడా ఈ పోస్ట్ కి స్పందిస్తూ ‘‘మోర్ పవర్ టు యూ, బీ స్ట్రాంగ్’’ అనే అర్థం వచ్చేలా ఎమోజీలతో కామెంట్స్ పెట్టారు. దానితో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. సమంత తన వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టారంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ‘ఏమైంది మేడమ్.. ధైర్యంగా ఉండండి’ అంటూ సమంతకు ధైర్యం చెప్తున్నారు.
సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత గత కొంతకాలంగా అంతగా కనిపించడం లేదు. తరచూ తన అప్‌డేట్స్ నెట్టింట అభిమానులతో పంచుకునే సామ్ జూన్ 16 తర్వాత ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. కేవలం సినిమాల అప్‌డేట్స్, ప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న ప్రకటనలను మాత్రమే షేర్ చేస్తున్నారు. దానితో సామ్ కెరీర్‌పై నెటిజన్లు విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. విడాకుల తర్వాత సమంతకు అవకాశాలు తగ్గిపోయాయంటూ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సామ్ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: ఖుష్బూకి ఆపరేషన్..అస్సలు ఖుష్బూకి ఏమి జరిగింది !