Site icon Prime9

Usthad Bhagath Singh : “ఉస్తాద్ భగత్ సింగ్” నుంచి బ్లాస్టింగ్ అప్డేట్.. ఈసారి పర్ఫామెన్స్ మామూలుగా లేదంటూ !

harish shankar tweet about usthad bhagath singh goes viral

harish shankar tweet about usthad bhagath singh goes viral

Usthad Bhagath Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలలో  జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. ఒక సినిమా తర్వాత ఒక సినిమాని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` కూడా ఒకటి. పదేళ్ళ క్రితం డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా చేస్తుండగా.. అశుతోష్ రానా, కెజిఎఫ్ అవినాష్, నవాబ్ షా లాంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు.

తాజాగా ఉస్తాద్ భగత్ (Usthad Bhagath Singh) సింగ్ సినిమా నుంచి హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా ఒక అప్డేట్ ఇచ్చారు. ఆ పోస్ట్ లో.. ఓ క్లాప్ బోర్డు, హరీష్ శంకర్ క్యాప్ ఉన్న ఫోటోని తన ట్విట్టర్లో షేర్ చేశారు. “సినిమాలో చాలా ఇంపార్టెంట్, ఇంటెన్స్ ఉన్న షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసి షెడ్యూల్ ప్యాకప్ చెప్పాము. పవన్ కళ్యాణ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉండండి అని రాసుకొచ్చారు.

 

 

ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మరో కథానాయికగా అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’, వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ సినిమాల ఫేమ్ సాక్షి వైద్య నటిస్తున్నారు. ఈ సినిమాకు (Usthad Bhagath Singh) ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కాకుండా సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ సినిమాలు చేస్తున్నారు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి నిర్మించే సినిమా కూడా చేయాల్సి ఉంది.

Exit mobile version