Site icon Prime9

DDLJ Remake: “డీడీఎల్‌జె” రీమేక్‌‏లో విజయ్ దేవరకొండ?

Vijay Devarakonda in DDLJ Remake

Tollywood Gossips: వెండితెర ప్రపంచంలో ఎన్నో ప్రేమకథ చిత్రాలు సందడి చేసి ప్రేక్షకుల మనస్సును హద్దుకున్న అద్భుతమైన ప్రేమకథలు చాలా తక్కువగా ఉంటాయి. ఆ కోవలోకి చెందిన సినిమానే బాలీవుడ్ బాద్ షా నటించిన “దిల్ వాలే దుల్హానియా లే జాయింగే”. డైరెక్టర్ అదిత్య చోప్రా తెరకెక్కించిన ఈ సినిమాలో షారుఖ్ సరసన కాజోల్ నటించింది. ఈ అందమైన ప్రేమకావ్యం అప్పట్లో అన్ని రికార్డ్‏లను బద్దలు కొట్టి, భారీగా వసూళ్లు రాబట్టడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది.

అయితే తాజాగా ఈ సినిమా రీమేక్ అవబోతుంది అని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఈ రీమేక్ లో హీరో ఎవరనేదే హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు. డైరెక్టర్ అదిత్య చోప్రా ఈ సినిమాను ఇప్పుడు కొత్త తరం ప్రేక్షకుల కోసం తగినట్టుగా స్టోరీ మార్చి రీమేక్ చేయాలని భావిస్తున్నారట. అయితే ఈ రీమేక్ లో షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ లేదా కుమార్తె సుహానా నటించనున్నారని ముందు నుంచి టాక్ వినిపించింది.

ఇటీవల జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2022లో తన కన్నీళ్లను అపుకొని, బాలీవుడ్‌కు తనను పరిచయం చేసిన తన లైగర్ సినిమా వైఫల్యాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు మన వరల్డ్ ఫేమస్ లవర్, “గొప్ప సినిమా తీస్తానని మీకు హామీ ఇస్తున్నాను” అని అన్నాడు. దీంతో అనుహ్యంగా విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది.

DDLJ రీమేక్‏లో షారుఖ్ స్థానంలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించనున్నట్లుగా గాసిప్స్ నడుస్తున్నాయి. ఇప్పటికే డైరెక్టర్ ఆదిత్య చోప్రా విజయ్ ను కలిసి ఈ మూవీ గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ మూవీలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ లేదా నేషనల్ క్రష్ రష్మికను ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం విజయ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నారు. ఇందులో సమంత కథానాయికగా నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి విజయ్ కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే రెండు మెగా ప్రాజెక్ట్ ఆఫర్స్ కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది.

అయితే ఇప్పటివరకు డీడీఎల్ రీమేక్ పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Exit mobile version