Site icon Prime9

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న నేషనల్ క్రష్ రష్మీక మందన్న

Rashmika Mandanna open up on online trolls

Rashmika Mandanna open up on online trolls

నేషనల్ క్రష్ రష్మీక మందన్న ” సీతారామం ” సినిమాతో ఈ అమ్మడు రూటు మార్చేసింది . తన నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో న‌టించ‌టానికి రష్మీక మందన రెడి ఐనట్లు తెలిసిన సమచారం . ఈ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న‌ మ‌రో క్రేజీ మూవీకి ఓకే చెప్పేసిన‌ట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇంత‌కీ ఆ సినిమా హీరో ఎవ‌రో కాదు.. అక్కినేని వారసుడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య‌. థాంక్యూ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన నాగ చైత‌న్య. ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. పరశురాం దర్శ‌క‌త్వంలో అక్కినేని నాగ చైత్యన్య ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి అందరికి తెలిసిన విషయమే . ఈ సినిమాలో హీరోహిన్నుగా ర‌ష్మిక తీసుకోకునున్నారు.

నేషనల్ క్రష్ ర‌ష్మిక మందన్న మంచి జోరు మీద ఉంది. ఆమె ద‌క్షిణాదిని ఇటు పాన్ ఇండియా సినిమాలను అటు బాలీవుడ్ సినిమాలను మొత్తం కవర్ చేస్తూ నటిస్తుంది. స‌క్సెస్ వచ్చిన క్రేజ్‌తో ఈ అమ్మడు ఎక్కడా కూడా తగ్గడం లేదు. ఈ అమ్మడు అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటూ మాములుగా దూసుకెళ్లడం లేదు. క్రేజీ ప్రాజెక్ట్స్‌లో గ్లామ‌ర్ రోల్స్‌లో న‌టిస్తూనే రీసెంట్‌గా విడుద‌లైన సీతారామం సినిమాలో చేసిన వెరైటీ పాత్ర‌లు చేయ‌టానికి కూడా తాను సిద్ధ‌మ‌ని గ్రీన్ సిగ్న‌ల్ ఎప్పుడో ఇచ్చేసింది. దీంతో అమ్మ‌డు కోసం ద‌ర్శ‌క నిర్మాత‌లు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. అయితే సినిమాల‌ను ఎంపిక చేసుకోవ‌టంలో మ‌న రష్మీక బ్యూటీ అస్సలు తొంద‌ర‌ప‌డ‌టం లేద‌ట‌. ఆచితూచి సినిమాల‌కు సైన్ పెడుతుంది.

మ‌రో వైపు ఈ సినిమా కోసం ర‌ష్మిక మంద‌న్న భారీ రెమ్యున‌రేష‌న్‌నే డిమాండ్ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే కోటి రూపాయ‌ల‌కు పైగా రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న ర‌ష్మిక మంద‌న . నాగ చైత‌న్య సినిమాకు ఏకంగా రెండు కోట్ల వ‌ర‌కు అడిగిన‌ట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తుంది. అయితే ఈ అమ్మడు క్రేజ్‌ను అడిగినంత ఇవ్వడానికి బ నిర్మాత‌లు కూడా రెడీగా ఉన్నారని కధనాలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ర‌ష్మిక మంద‌న అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్ మూవీ పుష్ప ది రూల్‌లోనూ న‌టించ‌బోతున్న విషయం అందరికి తెలిసిన విషయమే .

Exit mobile version