Site icon Prime9

HariHaraVeeraMallu: పవర్‌స్టార్ ఫాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ..హరిహరవీరమల్లు పోస్టర్ రిలీజ్

Hariharaveeramallu poster release

Hariharaveeramallu poster release

#HariHaraVeeraMallu: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. దీనితో ‘హరి హర వీర మల్లు’ బృందం పవర్‌స్టార్ అభిమానులందరికీ పుట్టినరోజు బహుమతిని ఇచ్చింది. పవన్‌కి సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను షేర్ చేస్తూ నిర్మాతలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

“మా ‘సత్యం మరియు ధర్మం యొక్క పరాక్రమ రథసారధి’ #HariHaraVeeraMallu Sri @PawanKalyan గారికి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు” అని రాశారు.స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం’ అనే క్యాప్షన్‌తో దర్శకుడు క్రిష్‌ ఈ పోస్టర్‌ను షేర్‌ చేశాడు.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ‘ హరిహరవీరమల్లు’ ఒక లెజెండరీ వీరోచిత పోరాటం. చరిత్రలోని కొన్ని సంఘటనల నుండి ప్రేరణ పొందిన చిత్రం.ఈ చిత్రాన్ని మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు నిర్మిస్తున్నారు.నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version