Site icon Prime9

Up Coming Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే

december-second-week 2022-releasing-movies-list

december-second-week 2022-releasing-movies-list

Up Coming Movies: ప్రతీవారం సినీ ప్రేక్షకులను అలరించడానికి కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద వస్తూనే ఉంటాయి. వెళ్తూనే ఉంటాయి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే సినీ ప్రేక్షకులు ఆ చిత్రాలు ఆదరిస్తున్నారు. మరి ఈ వారం థియేటర్ మరియు ఓటీటీలోకి వచ్చే సినిమాలేంటో అవి ఎప్పుడు ప్రజల ముందుకు వస్తున్నాయో చూసేద్దాం.

గుర్తుందా శీతాకాలం:
నాగశేఖర్‌ దర్శకత్వంలో టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా, సత్యదేవ్ జంటగా నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. ఈ చిత్రం డిసెంబర్‌ 9న రిలీజ్‌ కానుంది. కన్నడలో బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించిన లవ్‌ మాక్‌టైల్‌కు రీమేక్‌గా ఈ మూవీ తెలుగులో విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి.

పంచతంత్రం:
బ్రహ్మనందం ముఖ్య పాత్రలో శివాత్మిక రాజశేఖర్, స్వాతి రెడ్డి, సముద్రఖని, రాహుల్‌ విజయ్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్న పంచతంత్ర సినిమా కూడా డిసెంబర్‌9న రిలీజ్‌ కానుంది. చిత్రబృందం రిలీజ్‌ చేసిన ప్రచార చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు.

ముఖచిత్రం:
విశ్వక్‌ సేన్‌ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా కూడా డిసెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. గంగాధర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కలర్‌ ఫోటో దర్శకుడు సందీప్‌ రాజ్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించాడు.

ప్రేమదేశం:
త్రిగుణ్‌, మేఘా ఆకాశ్ జంటగా నటించిన ఈ మూవీ ఈ శుక్రవారం అనగా డిసెంబర్ 9న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌లు సినిమాపై మంచి బజ్ తీసుకొచ్చాయి.

విజయానంద్‌:
ఇటీవల కాలంలో భాషతో సంబంధం లేకుండా వరుసగా కన్నడ సినిమాల హవా కొనసాగుతోంది. సౌత్‌, నార్త్‌ అని తేడా లేకుండా ప్రతీ చోట కన్నడ సినిమాలకు విశేష ఆధరణ లభిస్తుంది. ఈ క్రమంలోనే మరో కన్నడ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. నిహాల్‌ రాజ్‌పుత్‌, భారత్‌ బోపన్నా, అనంత్‌ నాగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 9న రిలీజ్‌ కానుంది.

డేంజరెస్‌:
డేరింగ్‌ అండ్ డాషింగ్‌ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్సర రాణి, నైనా గంగూళి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఇండియాలో తొలి లెస్బియన్‌ సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు యూత్‌లో మంచి బజ్ క్రియేట్‌ చేశాయి.

వీటితో పాటుగా ప్రేమదేశం రీ-రిలీజ్‌, చెప్పాలని ఉంది, లెహరాయి, నమస్తే సేట్ జీ, రాజయోగం, ap04 రామాపురం, ఐ లవ్ యూ ఇడియట్, మనం అందరం ఒక్కటే, , సివిల్ ఇంజనీర్, ఆక్రోశం, ఏయ్ బుజ్జి నీకు నేనే అనే సినిమాలు రిలీజ్‌ ఈ వారంలో విడుదల కానున్నాయి.

ఓటీటీలో రిలీజ్‌ కానున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు:

అమెజాన్‌ ప్రైమ్‌ :
బ్లాక్‌ ఆడమ్‌-డిసెంబరు 10

జీ5 :
మాచర్ల నియోజకవర్గం(తెలుగు)-డిసెంబరు9
బ్లర్‌ (హిందీ)- డిసెంబరు 9
మాన్‌సూన్‌ రాగా (కన్నడ) -డిసెంబరు 9

సోనీలివ్‌ :
లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌ (తెలుగు)- డిసెంబరు 9
రాయ్‌ (మలయాళం)- డిసెంబరు 9
ఫాదూ (హిందీ సిరీస్‌)-డిసెంబరు 9
విట్నెస్‌ (తమిళ్‌ చిత్రం)- డిసెంబరు9

నెట్‌ఫ్లిక్స్ :
నజర్‌ అందాజ్‌ (హిందీ)-డిసెంబరు4
సెబాస్టియన్‌ మానిస్కాల్కో: ఈజ్‌ ఇట్‌మి (హాలీవుడ్‌)- డిసెంబరు6
ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ (తమిళ్‌)- డిసెంబరు8
క్యాట్‌ (హిందీ సిరీస్‌)-డిసెంబరు9
మనీ హైస్ట్‌: కొరియా జాయింట్‌ ఎకనామిక్‌ ఏరియా (వెబ్‌సిరీస్‌2)-డిసెంబరు9

ఆహా:
ఊర్వశివో రాక్షసివో (తెలుగు)-డిసెంబరు9. నెట్‌ఫ్లిక్స్‌లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.

డిస్నీ+హాట్‌స్టార్:
మూవింగ్‌ విత్‌ మలైకా (వెబ్‌సిరీస్‌)- డిసెంబరు5
కనెక్ట్‌(కొరియన్‌ సిరీస్‌)- డిసెంబరు7
ఫాల్‌ (తమిళ్‌)- డిసెంబరు9

ఇదీ చవదండి: దేశంలో మరో 10వేల థియేటర్స్‌ రాబోతున్నాయ్..!

Exit mobile version