Site icon Prime9

Arjun Kapoor: గర్భవతి అయిన మలైకా అరోరా.. ఆగ్రహం వ్యక్తం చేసిన అర్జున్ కపూర్

Arjun Kapoor Slams Report Claiming Malaika Arora Is Pregnant

Arjun Kapoor Slams Report Claiming Malaika Arora Is Pregnant

Arjun Kapoor: బాలీవుడ్ లవ్ బర్డ్స్ అర్జున్ కపూర్, మలైకా అరోరా జంట తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తుంటుంది. 37 ఏళ్ల అర్జున్ తనకంటే 12 ఏళ్లు పెద్దదైన మలైకా అరోరాతో ప్రేమలో మునిగితేలుతూ గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు. కాగా ఎప్పుడూ తమ అప్డేట్స్ ను నెట్టింట అభిమానులతో పంచుకుంటూ ఉండే ఈ జంట ఇప్పుడు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.

మలైకా అరోరా తల్లికాబోతుందని, కొద్ది రోజుల్లో వీరిద్దరూ పెళ్లిపీటలెక్కనున్నారంటూ ఓ ఆంగ్ల మీడియా కథనం ప్రచరించింది. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కాగా ఆ విషయంపై ఇప్పుడు అర్జున్ కపూర్ నోరువిప్పాడు. ఈ వార్తను అర్జున్ ఖండించాడు. ఆ వార్త స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసిన అర్జున్.. ఇలాంటి పనికిరాని రాతల వల్ల మేం ఎంతలా ఇబ్బందిపడతామో మీకు తెలుసా? అని ప్రశ్నించాడు. తాము పట్టించుకోకపోవడం వల్లే సదరు విలేకరి తరచూ ఇటువంటి వార్తలనే రాస్తున్నారని, అవి సోషల్ మీడియాలో ట్రెండ్ అవడంతో అంతా నిజమని నమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకనైనా తమ వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే ధైర్యం చేయొద్దని హెచ్చరించాడు. అర్జున్ కామెంట్ ను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన మలైక కూడా తీవ్ర పదజాలంతో ఈ వార్తలను ఖండించింది.

సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ తో 2017లో విడాకులు తీసుకున్న మలైక.. బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడైన అర్జున్ ప్రేమలో పడటం అప్పట్లో చర్చనీయాంశమైంది. మొదట్లో తమ సంబంధాన్ని రహస్యంగా ఉంచిన ఈ ఇద్దరూ తర్వాత చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: పాప్యులారిటీ ఉన్నప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మాములే.. ఈడీ విచారణపై విజయ్ స్పందన

Exit mobile version