Site icon Prime9

TS Govt Jobs 2022: బస్తీ, పల్లె దవాఖానాల్లో భారీగా ఖాళీలు.. 1569 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Govt jobs in basthi Dawakhana

Govt jobs in basthi Dawakhana

Hyderabad: తెలంగాణ వైద్యారోగ్య-కుటుంబ శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లోని బస్తీ, పల్లె దవాఖానాల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేయడానికి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తంగా 1569 ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ ద్వారా పూర్తిచెయ్యనుంది. దీనికి గానూ ఎంబీబీఎస్/బీఏఎమ్ఎస్ అర్హత కలిగిన వైద్యులను పరిగణనలోకి తీసుకుంటారు. ఎంబీబీఎస్ అర్హత కలిగిన వారికి మొదట ప్రాధాన్యం ఇస్తారు.

ఈ పోస్టులో పనిచేయడానికి ఎంబీబీఎస్/బీఏఎమ్ఎస్ వైద్యులు రాకుంటే, 2020 తర్వాత ఉత్తీర్ణత సాధించిన బీఎస్సీ నర్సింగ్‌ లేదా 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్/జీఎన్ఎంలో ఉత్తీర్ణులై, కమ్యూనిటీ హెల్త్‌లో 6 నెలల బ్రిడ్జ్ ప్రోగ్రాం కంప్లీట్ చేసిన వారిని పరిగణలోకి తీసుకుంటారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి లేదా ఈ ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన సర్టిఫికేట్స్ జిరాక్స్ ను సంబంధిత జిల్లా డీఎంహెచ్‌వో కార్యాలయం, నిజామాబాద్ చిరునామాకు పంపాల్సి ఉంటుంది. ఆయా జిల్లాల వెబ్‌సైట్‌లో వేర్వేరుగా నోటిఫికేషన్, దరఖాస్తులను ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ అందుబాటులో ఉంచింది. జిల్లాల వారీగా ఖాళీల సంఖ్య మరియు ఇతర ముఖ్య వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

ఖాళీలు: బస్తీ దవాఖానాల్లో-349, పల్లె దవాఖానాల్లో 1220 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

వయసు: 18- 44 ఏళ్ల మధ్య వయస్సు గల వారు ఈ పోస్టుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు అయిదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.

జీతం: ఎంఎల్‌హెచ్‌పీలుగా పనిచేసే ఎంబీబీఎస్/బీఏఎమ్ఎస్ వైద్యులకు నెలకు రూ.40 వేలు. ఈ పోస్టులో పనిచేసే స్టాఫ్‌ నర్సులకు నెలకు రూ.29,900 చొప్పున గౌరవ వేతనం ఇస్తారు.

ఇంపార్టెంట్ డేట్స్..
దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు: 17.09.2022.
పరిశీలన తేదీలు: 18.09.2022 నుంచి 28.09.2022.
అర్హుల జాబితా వెల్లడి తేదీ: 29.09.2022.
అభ్యంతరాల స్వీకరణ తేదీ: 30.09.2022.
ఉద్యోగాలకు ఎంపికైన వారి ఫైనల్ లిస్ట్ విడుదల: 03.10.2022.

ఇదీ చదవండి: మహిళలకు మాత్రమే.. అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుకు అప్లికేషన్ ప్రక్రియ షురూ

Exit mobile version