Hyderabad: నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 833 ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీకి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు టీఎస్పీఎస్సీ తాజా ప్రకటనలో పేర్కొంది. దీనికి గాను సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 21 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది. ఇతర పూర్తి వివరాల కోసం టీఎస్పీఎస్పీ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ కు లాగిన్ అయి తెలుసుకోవచ్చని పేర్కొనింది.
కాగా ఇటీవలె మున్సిపల్ డిపార్టుమెంట్‌లో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టులకు, రాష్ట్ర, మహిళ శిశు సంక్షేమ శాఖలో 23 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరో నోటిఫికేషన్ ఇవ్వడంతో నిరుద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: TS Govt Jobs 2022: బస్తీ, పల్లె దవాఖానాల్లో భారీగా ఖాళీలు.. 1569 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల