Site icon Prime9

Tirumala: శ్రీవారి బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు.. రేపటి నుంచే అమలు

TTD mobile app

TTD mobile app

Tirumala: తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన వేళలను మారుస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. రాత్రి సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం వారికి ఉదయం త్వరగా స్వామి వారి దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ మార్పులు రేపటి నుంచే గురువారం అనగా డిసెంబర్ 1 నుంచే అమలులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు.

వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్లున్న భక్తులు ఇప్పటి వరకు ఉదయం 6 గంటలకే స్వామి వారిని దర్శించుకోగా దానిని తాజాగా ఉదయం 8 గంటలకు మార్చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. నెల రోజుల పాటు ఈ విధానాన్ని పరిశీలించి, ఫలితాలను బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఉదయం 10.30 నుంచి జనరల్‌ బ్రేక్‌ దర్శనం ప్రారంభిస్తారు. ఇక ఈ తాజా నిర్ణయంతో సామాన్య భక్తులు వేచి ఉండే సమయం తగ్గనుంది. భక్తులు ఏరోజుకారోజు తిరుమలకు చేరుకుని బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం ఉందని, ఫలితంగా తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం మినీ జాతర

Exit mobile version