Site icon Prime9

Tunisha Sharma: లవ్ జిహాద్ అంటే ఏంటి.. నటి తునీషా శర్మ కేసును ఎందుకలా అంటారు..?

why should called tunisha sharma case as love jihad

why should called tunisha sharma case as love jihad

Tunisha Sharma: బాలీవుడ్ యాక్టర్, సీరియల్ నటి తునీషా శర్మ గత శనివారం రోజున ఓ టీవీ సీరియల్ సెట్లో శవమై కనిపించారు. అయితే తునీషా మరణంపై రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. అసలు తునీషాది ఆత్మహత్యా.. హత్యా.. ఆమెది లవ్ జిహాద్ కేసు అని ఎందుకు అంటున్నారు అనే విషయాలను ఇప్పుడు చూసేద్దాం.

బాలీవుడ్ యాక్టర్, సీరియల్ నటి తునీషా శర్మ డిసెంబర్ 24 శనివారం రోజు ఓ టీవీ షూటింగ్ సెట్‌లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. అయితే పోలీసులు తొలుత ఆమె ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. తునీషా శర్మ ఆత్మహత్యకు ఆమె ప్రియుడు, సహనటుడైన షీజన్ ఖాన్‌ కారణమంటూ అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. కాగా విచారణలో పలు అంశాలు బయటకు వెలువడ్డాయి. శ్రద్ధావాకర్ హత్యకేసు వల్లే ఆమెకు బ్రేకప్ చెప్పానని ఆమె ప్రియుడు షీజన్ పోలీసుల ఎదుట ఒప్పకున్నారు. ఆమె హిందూ, నేను ముస్లిం మరియు ఆమెకు నాకు 8ఏళ్ల వయస్సు గ్యాప్ ఉందని భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయనే తనతో రిలేషన్ కంటిన్యూ చెయ్యలేకపోయానంటూ షిజన్ చెప్పారు. ఇకపోతే ఆమె మరణంపై సినీ రంగానికి చెందినవారంతా సంతాపం వ్యక్తం చేస్తుండగా, మహారాష్ట్ర మంత్రి సహా అనేక మంది రాజకీయ నాయకులు ఆమె మృతిని ‘లవ్ జిహాద్’గా చెప్తున్నారు.

లవ్ జిహాద్ అంటే ఏంటి..

”కొందరు ప్రేమ, పెళ్లి ముసుగులో బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడుతున్నారు. ఇలాంటి పెళ్లిళ్ల తర్వాత ఆడపిల్లలు ఎంతో వేదనను అనుభవిస్తున్నారు. ఇలాంటి కేసులనే మీడియాలో లవ్ జిహాద్‌గా పిలుస్తున్నారు”అని మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా చెప్పారు. దీనిని నివారించేందుకే బలవంతపు మత మార్పిళ్లను అడ్డుకోవడమే లక్ష్యంగా ”ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2020”ని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది.

చట్టం ఏం చెప్తుంది..

రాజ్యాంగంలో పొందు పరిచిన నిబంధనల ప్రకారం.. ఎవరైనా తమకు నచ్చిన మతాన్ని ఎంచుకోవచ్చు. తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. ”ఇష్టపూర్వకంగా మతం మార్పిడి చేసుకునేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. దీని కోసం వారు జిల్లా మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు పెట్టుకోవాలి. దీనిపై విచారణకు మెజిస్ట్రేట్ ఆదేశిస్తారు. ఇందులో ఏదైనా తేడాగా అనిపిస్తే, పెళ్లికి అనుమతి ఇవ్వం. పెళ్లి అయిన తర్వాత కూడా అమ్మాయిల కుటుంబం ఫిర్యాదు చేస్తే, చర్యలు తీసుకుంటాం. ఇవే అంశాలను చట్టంలో పొందుపరిచాం” అని నరోత్తమ్ చెప్పారు.

శిక్షాకాలం ఎంత..

లవ్ జిహాద్ కింద కేసు నమోదు అయితే కాగ్నిజిబుల్ కేసుగా పరిగణించి 5 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు. ఈ కేసుకు బెయిలు కూడా ఇవ్వరు. అంతేకాకుండా ఈ నేరానికి పాల్పడిన వారితోపాటు దీనికి సహకరించిన స్నేహితులు, కుటుంబ సభ్యులకూ శిక్షలు విధించేలా నిబంధనలు సిద్ధం చేస్తున్నామని నరోత్తమ్ చెప్పారు.

ఇదీ చదవండి: శ్రద్ధావాకర్ హత్య వల్లే నటి తునిషాకి బ్రేకప్ చెప్పా.. ప్రియుడు షిజాన్ ఏం చెప్పాడంటే..?

 

Exit mobile version