Vijayawada: ఏపీ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతుంది. అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. రెండేళ్ల నుండి నిరుద్యోగులను మోసం చేస్తున్న ఇద్దరి కానిస్టేబుల్స్ అరెస్ట్ తో అసలు బండారం బయటపడింది. వివరాల్లోకి వెళ్లితే,
కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సురేష్, కానిస్టేబుల్ సుబ్బారెడ్డిలు హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ స్థానిక నిరుద్యోగులకు నమ్మబలికారు. ఒక్కొక్కరి దగ్గర నుండి రూ. 10లక్షల వసూలు చేసిన్నట్లు సమాచారం. దీంతో పలువురు నిరుద్యోగుల నుండి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు. అయితే ఉద్యోగాలు రాకపోవడంతో ఇరువురు కానిస్టేబుళ్లను బాధితులు నిలదీశారు. దీంతో నియామక పత్రాల పేరుతో బాధితులకు కొన్ని పత్రాలు అందచేశారు. అవికాస్తా నకిలీవిగా తేలడంతో బాధిత నిరుద్యోగులు ఇద్దరు కానిస్టేబుళ్ల పై వత్తిడి తీసుకొచ్చారు.
వ్యవహరాం కాస్తా మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారాలు కావడంతో కృష్ణ లంక పోలీసులు స్పందించారు. నిరుద్యోగులను మోసం చేసిన ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఇక్కడే పోలీసుల తీరు పలు అనుమానాలకు తావిస్తుంది. హోంగార్డు ఉద్యోగాలతో నిరుద్యోగులకు టెండర్ వేయడం అనేది ఆషామాషీ వ్యవహరం కాదు. అది కూడా 24నెలలుగా సాగుతున్న ఈ ప్రక్రియపై స్వయానా పోలీసుల పాత్రే ఉండడంతో వాస్తవాలను కప్పిపుస్తున్నారని భావించాల్సిందే. ఎందుకంటే ఓ కానిస్టేబుల్ స్థాయిలో ఉద్యోగాల పేరిట నగదు వసూలు చేయడం అనేది అంత సులువైనది కాదు. తెర వెనుక పాత్రలపై కూడా పోలీసులు దృష్టి సారించాలి. ఇందులోని వాస్తవాలను బయటకు తీస్తారో, లేదా ప్రభుత్వ పోలిసింగ్ లాగా వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే.
ఇది కూడా చదవండి: AP High Court: అయ్యన్న పై సీఐడీ దర్యాప్తు కొనసాగించొచ్చు.. హైకోర్టు