Site icon Prime9

Crime News: దారుణం.. మెడికో విద్యార్థి హత్య

Medico dies as techie slits her throat in guntur district

Medico dies as techie slits her throat in guntur district

Crime News: గుంటూరు ‌జిల్లా తక్కెళ్లపాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్య విద్యార్థిని తపశ్వి అనే యువతిపై ఓ యువకుడు సర్జికల్ బ్లేడుతో దాడి చెయ్యగా ఆ యువతి మృతి చెందిది.

తపస్వి విజయవాడలోని వైద్య కళాశాలలో చదువుతోంది. కాగా ఆమెకు ఇన్ స్టాగ్రామ్ ద్వారా హైదరాబాద్ కు చెందిన జ్ఞానేశ్వర్‌ అనే సాఫ్ట్‌వేర్ పరిచయం అయ్యాడు. కాగా  రెండు సంవత్సరాలుగా వీరిరువురు స్నేహంగానే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. గతంలో జ్ఞానేశ్వర్ పై తపస్వి విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలుసుకున్న జ్ఞానేశ్వర్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

ఇదిలా ఉంటే వీరిద్దరి మధ్య తపస్వి స్నేహితురాలు సంధి కుదర్ఛడానికి ప్రయత్నించింది. దానిలో భాగంగా తపస్వి తక్కెళ్లపాడులోని తన స్నేహితురాలు వద్ద వారం రోజులుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న జ్ఞానేశ్వర్ తపశ్విపై దాడికి పాల్పడ్డాడు. తనతో తెచ్చుకున్న సర్జికల్ బ్లేడ్ తో గొంతు కోసాడు. అనంతరం తాను కూడా చేయి కోసుకున్నాడు. దానితో గట్టిగా కేసులు వేసుకుంటూ తపస్వి స్నేహితురాలు బయటకు పరుగులు పెట్టడంతో స్థానికులు లోపలి వచ్చి చూశారు. రక్తపుమడుగులో  కుప్పకూలి ఉన్న తపశ్విని చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. నిందితుడు జ్ఞానేశ్వర్‌ను పట్టుకుని పోలీసులు అప్పగించారు స్థానికులు. తపస్వి మృతదేహన్ని పోస్టుమార్టం కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు.

ఇదీ చదవండి: దారుణం.. మార్కెట్లో అందరి ఎదుటా మహిళ చేతులు, చెవులు, రొమ్ములు నరికేసారు..

Exit mobile version