Karnataka: కర్ణాటక రాష్టంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని యాదగిర్ జిల్లాలో ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో 5 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యారు. ప్రమాదానికి గురైన వారంతా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించారు. కర్నూలు, నంద్యాల జిల్లాలలోని బండి ఆత్మకూరు, వెలుగోడు నుంచి గుల్బర్గా దర్గా దర్శనానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
బాధితులకు అండగా ఉంటాం- ఎమ్మెల్యే(Karnataka)
ఈ రోడ్డు ప్రమాద ఘటనపై శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన స్థలానికి వెలుగోడుకు చెందిన నాయకులను, లాయర్ ను పంపారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.