Site icon Prime9

Crime News: తాంత్రికుడి కళ్లెదుటే శృంగారం చేసిన జంట.. సీన్ కట్ చేస్తే శవాలై..!

In Rajasthan a tantrik-asks-couple-to-have-romance-in-front-of-him-pours-feviquick-kills-them

In Rajasthan a tantrik-asks-couple-to-have-romance-in-front-of-him-pours-feviquick-kills-them

Crime News: వివాహేతర సంబంధాల ఉచ్చులో పడి పచ్చని సంసారాలు సర్వనాశనం అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. రాజస్థాన్ ఉదయపూర్‌లోని కెలాబావాడి అటవీ ప్రాంతంలో నగ్నంగా దొరికిన ఓ వ్యక్తి మరియు మహిళ మృతదేహాలు స్థానికంగా కలకలం రేపాయి.

వివరాల్లోకి వెళ్తే 30 ఏళ్ల టీచర్ రాహుల్ మీనా, 28 ఏళ్ల సోను కున్వర్‌ లు ఇద్దరూ వేర్వేరు వ్యక్తులను వివాహం చేసుకున్నారు.ఈ ఇద్దరూ కూడా భదవిగూడలోని భావ్‌జీ మందిర్‌లో ఉన్న తాంత్రికుడిని వారి కుటుంబాలతో అప్పుడప్పుడూ సందర్శించేవారు. అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. రాహుల్, అతడి భార్య మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో రాహుల్ భార్య తాంత్రికుడైన భలేష్ కుమార్‌ను సాయం కోరింది.

మరోవైపు తన అక్రమ సంబంధాన్ని భార్య ముందు బట్టబయలు చేసింది తాంత్రికుడేనని తెలుసుకున్న రాహుల్.. అతడ్ని బెదిరించసాగాడు. దానితో తన పేరు ప్రతిష్టలు పోతాయేమోనన్న భయపడిన తాంత్రికుడు రాహుల్, సోనూలను హత్య చేసేందుకు పక్కా ప్లాన్ వేశాడు. అందులో భాగంగానే దాదాపు 50 ట్యూబ్‌ల ఫెవిక్విక్‌ కొనుగోలు చేసి బాటిల్‌లో నింపాడు. ఆ తరువాత నవంబర్ 15వ తేదీ సాయంత్రం రాహుల్, సోనూలను అటవీ ప్రాంతానికి రావాలని చెప్పాడు. అక్కడికి చేరుకున్న వారిని తన ఎదుట శృంగారంలో పాల్గొనాలని బెదిరించాడు. ఇక ఆ ఇద్దరూ వచ్చి ఆ పనిలో ఉన్నప్పుడు తాంత్రికుడు ఫెవిక్విక్‌ను వారిపై పోశాడు. దీంతో రాహుల్, సోను చాలాసేపు ఒకరికొకరు అతుక్కుపోయారు. దానితో భలేష్ కుమార్ వారిని హతమార్చి అక్కడ నుంచి పారిపోయాడు. కొద్దిరోజులకు మృతదేహాలు లభ్యమవడంతో పూర్తి దర్యాప్తు చేపట్టిన పోలీసులు భలేష్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్యలు తానే చేసినట్లు అంగీకరించాడు.

ఇదీ చదవండి: కుటుంబం మొత్తాన్ని నరికిచంపిన కొడుకు

Exit mobile version